»   » నవ్వకుండా డబ్బింగ్ చెప్పాలంటే కష్టంగా ఉంది : రామ్‌

నవ్వకుండా డబ్బింగ్ చెప్పాలంటే కష్టంగా ఉంది : రామ్‌

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మొదటిసారి డబ్బింగ్‌ చెప్పే సమయంలో నవ్వు ఆపుకోలేక పోతున్నా.. అంటూ 'శివమ్‌' హీరో రామ్‌ అంటున్నారు. ఆక్టోబర్‌ 2న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

sivam1

ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పే క్రమంలో ఓ సీన్‌ కోసం 16 టేక్స్‌ తీసుకున్నాడు రామ్‌.

ఈ చిత్రంలో రామ్‌ సరసన వూహాలు గుసగుసలాడే హీరోయిన్ రాశి ఖన్నా నటిస్తున్నారు.ఈ చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.

నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ ''హుషారైన ఓ కుర్రాడి ప్రేమకథ ఇది. వినోదం, భావోద్వేగాలు, యాక్షన్‌ మేళవింపుతో తెరకెక్కుతోంది. రామ్‌ తన శైలికి తగ్గ పాత్రని పోషిస్తున్నాడు''అన్నారు.

sivam2

అలాగే - "కథాబలం ఉన్న చిత్రం ఇది. స్క్రీన్ ప్లే కూడా బ్రహ్మాండంగా కుదిరింది. మంచి హై ఓల్టేజ్ లవ్ స్టోరి. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డికి ఇది తొలి చిత్రం అయినప్పటికీ, అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి'' అని చెప్పారు.

బ్రహ్మానందం, అభిమన్యు సింగ్‌, జయప్రకాష్‌రెడ్డి, పోసాని తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి సంగీతం: ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌

English summary
Ram Pothineni ‏tweeted: "Take#15....First time navvakunda dubbing cheppalante kashtamgavundhi.. sigh..ready...Take#16"
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu