»   » రిస్క్ అనిపిస్తే నా ఆడియో ఫంక్షన్ కు రావొద్దు: రామ్

రిస్క్ అనిపిస్తే నా ఆడియో ఫంక్షన్ కు రావొద్దు: రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్, డైరెక్టర్ సంతోష్ శ్రీన్వాస్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'హైపర్'. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనేది ట్యాగ్ లైన్.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సెప్టెంబర్ 30న వరల్డ్వైడ్గా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. స్టార్ రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రానికి సంబందించిన ఆడియో వేడుక ఈ రోజు (సెప్టెంబర్ 23) సాయంత్రం నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతుండటం, రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉండి ప్రమాదకరంగా ఉండటంతో రామ్ అభిమానులకు ఓ సూచన చేసారు.


రోడ్లు బాగోలేవు, రిస్క్ అనిపిస్తే రావొద్దు

హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి అంత సురక్షితంగా అనిపించడం లేదు. ఏ మాత్రం రిస్క్ అనిపించినా ఫంక్షన్ కు రావొద్దు. టీవీలో లైవ్ ద్వారా చూడండి అని ట్వీట్ చేసారు.


సినిమాపై అంచనాలు

సినిమాపై అంచనాలు

'కందిరీగ' వంటి హిట్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో మొదటి నుంచీ ‘హైపర్' మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. కాగా, తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం హిందీ రైట్స్ భారీ రేటుకి అమ్ముడుపోయాయి.


ముంబై కంపెనీ ఎంతకు కొన్నదో తెలుసా?

ముంబై కంపెనీ ఎంతకు కొన్నదో తెలుసా?

ముంబయ్ కి చెందిన ఓ ప్రొడక్షన్ కంపెనీ ఈ హక్కులను రెండు కోట్లకు సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఇక్కడ ఇంకా విడుదల కాకుండానే ఒక తెలుగు చిత్రానికి హిందీ రైట్స్ ఈ రేంజిలో పలకడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. రామ్ సరసన రాశిఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.


 తారాగణం

తారాగణం

స్టార్ రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


నటీనటులు

నటీనటులు

ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: సమీర్రెడ్డి, ఆర్ట్: అవినాష్ కొల్లా, ఎడిటింగ్: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, సమర్పణ: వెంకట్ బోయనపల్లి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీన్వాస్.


English summary
"My dearest fans,the roads dont seem safe.Yemaatram risk anipinchina pls Refrain from coming to the event. You can watch it Live on TV." Ram tweeted about Hyper movie audio function.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu