»   » రామ్‌ 'బోల్‌ బచ్చన్‌'కి రీమేక్‌ టైటిల్ ఛేంజ్

రామ్‌ 'బోల్‌ బచ్చన్‌'కి రీమేక్‌ టైటిల్ ఛేంజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్‌, రామ్‌ హీరోలుగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్. విజయ్‌భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్‌ సంస్థ తెరకెక్కిస్తోంది. బాలీవుడ్‌లో విజయం సాధించిన 'బోల్‌ బచ్చన్‌'కి రీమేక్‌ ఇది. గత కొంత కాలంగా ఈ సినిమా కోసం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

మొదట ఈ చిత్రానికి 'గరమ్‌ మసాలా' అనుకొన్నారు. ఆ తరవాత అది 'గోల్‌ మాల్‌'గా మారింది. ఈమధ్య 'బ్లాక్‌ బస్టర్‌' అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు 'రామ్‌ బలరామ్‌' అనే పేరు పెడితే ఎలా ఉంటుంది? అని కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఖచ్చితమైన టైటిల్ ని ఖరారు చేయలేదు. త్వరలోనే చిత్రబృందం ఓ పేరు ఖరారు చేయనుంది.

చిత్రాన్ని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. . బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.

English summary
Venkatesh and Ram will feature in Telugu remake of Bollywood blockbuster 'Bol Bachchan'. Venkatesh will reprise the role of Ajay Devgn and Ram will be seen in the role of Abhisekh Bachchan in the film. Anjali will play the lady love to Venkatesh and Shazahn Padamsee is roped in to co-star Ram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu