»   » రామానాయుడికి ఎన్టీఆర్ రాముడు భీముడుతోనే...

రామానాయుడికి ఎన్టీఆర్ రాముడు భీముడుతోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హైదరాబాద్‌లో చిత్రసీమ స్థిరపడటానికి కృషి చేసిన ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి రామానాయుడు విశాఖపట్నంలో కూడా స్టూడియోను నిర్మించాలని, అక్కడ కూడా చిత్రపరిశ్రమను సుస్థిరం చేయాని భావించారు. ఇంతలోనే అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు తరలి పోయారు. రామానాయుడు మృతి చెందారన్న వార్త వెలుడిన వెంటనే ఆయన స్వగ్రామం కారంచేడులో విషాదఛాయలు నెలకొన్నాయి.

ఆయన ప్రకాశం జిల్లాలోని కారంచేడులో 1936, జూన్‌ 6న జన్మించారు. వందెకరాల ఆసామి అయినా సినిమాలపై ఉన్న మక్కువతో మద్రాసుకు వెళ్లారు. అక్కడ మొదట మిత్రులతో కలిసి డబ్బింగ్‌ సినిమా అనురాగం చిత్రాన్ని నిర్మించి ఆర్థికంగా నష్టాల పాలయ్యారు. అయినా అధైర్యపడకుండా సొంత నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ను స్థాపించి మేటి నటుడు ఎన్టీఆర్‌తో మొదటి సినిమా రాముడు భీముడు సినిమాను నిర్మించారు.

Rama Naidu tried to establish studio at Visakha

ఉందిలే మంచికాలం ముందుముందూనా అంటూ ఆయన తీసిన ఆ చిత్రం రామానాయుడుకు మాత్రమే కాదు తెలుగు చిత్రసీమకు కూడా మంచిరోజులను తీసుకొచ్చింది. రాముడు భీముడు సినిమా ఘనవిజయం తర్వాత రామానాయుడు మరి వెను దిరిగి చూడలేదు.

అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమనగర్‌, శోభన్‌బాబుతో దేవతతో పాటు అందరు హీరోలతోనూ సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా నటుడు సినిమారంగంలో విశిష్ట సేవలందించిన ఆయన రాజకీయరంగంలో కూడా అడుగు పెట్టారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరపున బాపట్ల ఎం.పి.గా పోటీ చేసి గెలుపొందారు. 2003లో ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు అందుకున్నారు.

English summary
Daggubati Rama Naidu got break even with NT Rama Rao's Ramudu Bheemudu film.
Please Wait while comments are loading...