twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సొంత కొడుకు కాదు.... రాజమౌళి గురించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గురించి ఇప్పటి వరకు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.... కార్తికేయ రాజమౌళి బయోలాజికల్ సన్ కాదు. రమ మొదటి వివాహం ద్వారా కలిగిన సంతానమే కార్తికేయ. అప్పటికే పెళ్లయి, ఒక కొడుకు ఉన్న డైవర్సీ రమను రాజమౌళి ప్రేమ వివాహం చేసుకున్నారు. రమ మరెవరో కాదు.... రాజమౌళి కజిన్ కీరవాణి భార్య, శ్రీవళ్లికి స్వయాన చెల్లెలు. రాజమౌళి, రమ వివాహం 2001లో చాలా సింపుల్ గా జరిగింది.

    రాజమౌళి సినిమాల గురించి అందరికీ తెలుసు కానీ.... ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. తాజాగా ఐడ్రీమ్ మీడియా వారి హాట్ టు హాట్ విత్ ప్రేమ ఇంటర్వ్యూలో రమారాజమౌళి తమ జీవితానికి సంబంధించి ప్రేక్షకులకు తెలియని చాలా విషయాలు ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.

    వర్క్, ఫ్యామిలీపై రాజమౌళి

    వర్క్, ఫ్యామిలీపై రాజమౌళి

    రాజమౌళి వర్క్ మీద ఎంత ఫోకస్ ఉంటుందో ఫ్యామిలీ అన్నా అంతే ఇష్టం ఉంటుంది. మేమిద్దరం కలిసిస్తే సినిమాల గురించి కాకుండా రిటైర్ అయిపోగానే ఏ ఊర్లు, ఏ దేశాలు తిరగాలి, ఇంకా ఎన్ని ఉన్నాయి పెండిగులో అనే విషయాలు చర్చించుకుంటామని రమ రాజమౌళి చెప్పుకొచ్చారు.

    హాలిడేలోనే కొత్త సినిమా ఆలోచనలు

    హాలిడేలోనే కొత్త సినిమా ఆలోచనలు

    రాజమౌళి ప్రతి సినిమా అయిపోగానే హాలిడే వెళతాం... అక్కడే తన తర్వాతి సినిమాకు సంబంధించిన ఆలోచన మొదలవుతుంది. తనకు వచ్చిన ఆలోచన ముందు నాకే చెబుతాడు. రాజమౌళి వర్క్ లోనే ఎంజాయ్‌మెంట్ వెతుక్కుంటారు అని రమ రాజమౌళి తెలిపారు.

    అయోమయంగా ఉంటారు

    అయోమయంగా ఉంటారు

    కొన్నిసార్లు పనిలో పడిపోయి అన్ని మరిచిపోతారు. ఓసారి ఎవరో ఇంటికెల్లి ఫోన్ అనుకుని రిమోట్ కంట్రోల్ జేబులో పెట్టుకుని తెచ్చేసాడు. ఏదో మాట్లాడుకుంటూ మరిచిపోయి ఓసారి కార్ కీస్ తెచ్చేసాడు. ఇపుడు మా ఫ్యామిలీలో ఏదైనా కనబడకపోతే ముందు ఆయన జేబులోచెక్ చేస్తారు. ఆయన సినిమా ప్రాజెక్టులో ఉంటే అది అయ్యేంత వరకు అయోమయంగా ఉంటారు. చివరకు పోస్టు ప్రొడక్షన్ సమయం వచ్చే సమయానికి ఇది మరింతగా ఉంటుంది. ఆ సమయంలో తను వేరే జోన్లో ఉంటాడు. ఏదైనా చేయాలనుకుంటే ఆయన చాలా ఇష్టపడి చేస్తాడు అని రమారాజమౌళి తెలిపారు.

    కార్తికేయకు రాజమౌళి స్పెప్ ఫాదర్

    కార్తికేయకు రాజమౌళి స్పెప్ ఫాదర్

    కార్తికేయకు రాజమౌళి సొంత తండ్రి కాక పోయినా....తనకుగానీ, మాకు గానీ హి ఈజ్ నాట్ హిస్ బయోలాజికల్ సన్ అనే మాట రాదు. చిన్నప్పటి నుండి హి యాక్సెప్టెడ్ హిమ్, మా పెంపకం కూడా అలానే ఉంది... అని రమా రాజమౌళి తెలిపారు.

    కార్తికేయ బిజీ

    కార్తికేయ బిజీ

    ట్రైలర్ విడుదలతో కార్తికేయ ప్రస్తుతం బాహుబలి నుండి బయట వెళ్లాడు. వేరే సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు. తర్వాతి సినిమా మాతో చేస్తాడో లేదో తెలియదు. ఇపుడు మాకంటే కార్తికేయ చాలా బిజీ అయిపోయాడు.. అని రమారాజమౌళి తెలిపారు.

    ఫ్యామిలీకే తప్ప బయటి వారికి అవకాశం ఉండదనే విమర్శలపై

    ఫ్యామిలీకే తప్ప బయటి వారికి అవకాశం ఉండదనే విమర్శలపై

    ఫ్యామిలీ మొత్తం ప్రతి ప్రాజెక్టులో ఉంటారు. హీరో హీరోయిన్ కొందరు టెక్నిషియన్స్ మాత్రమే బయటి వారు ఉంటారు. చాలా మంది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనే అంశంపై రమా రాజమౌళి స్పందిస్తూ...మాకు కలిసి పని చేసే సత్తా ఉంది. చాలెంజ్ చేయగలను మేము చేసినంత పని ఇపుడున్న ఇండస్ట్రీలో ఎవరూ చేయలేరు. మేము 20 గంటలు అలాగే పీల్డ్ మీద నిలబడి చేయగలం. నాలుగున్నర సంవత్సరాలు ప్రతి రోజు 20 గంటల పని చేసాం. అలా ఎవరు చేయగలరు? మేము ఎరినీ క్వశ్చన్ చేయకుండా, రూల్స్ మాట్లాడకుండా ఇది పని, ఇది ప్రాజెక్ట్... మన ముందు ఒక పెద్ద ప్రాజెక్టు ఉంది దీన్ని కంప్లీట్ చేయాలి అనే ఒకే ఒక థాట్ తో అందరం చేయగలం. మాకు కలిసి పని చేయడం సౌకర్యంగా ఉంది. హార్డ్ వర్క్ అనేది మా జీన్స్ లో ఉంది. మేం చేయగలిగినపుడు బయటి వారు ఎందుకు? ఒక పనికిరాని వారిని తీసుకొచ్చి మేము ప్రమోట్ చేస్తుంటే మమ్మల్ని తప్పు బట్టాలి, మా వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే, లేదా ఏదైనా నష్టం వచ్చి ఉంటే అనాలి... కానీ అలాంటి సందర్భం ఎప్పుడూ రాలేదు అని రమా రాజమౌళి అన్నారు.

    రాజమౌళికి అవేమీ తెలియదు

    రాజమౌళికి అవేమీ తెలియదు

    రాజమౌళి మనసులో డబ్బు థాట్ అసలు ఉండదు. నేనే కొంచెం ప్లానింగ్ చేయాలి. అవన్నీ నేనే చూసుకుంటాను. మళ్లీ మనం కిందకి వెళ్లకూడదు, చనిపోయే వరకు కంఫర్టబుల్ గా బ్రతకాలని ప్లాన్ చేస్తుంటా. తనకు ఫైనాన్స్ మేనేజ్మెంట్ అస్సలు తెలియదు అని రమారాజమౌళి తెలిపారు.

    చెక్ అథారిటీ కూడా నేనే తీసుకున్నాను

    చెక్ అథారిటీ కూడా నేనే తీసుకున్నాను

    చెక్కుల మీద కూడా సరిగా సంతకం పెట్టడం రాదు. ఆటోగ్రాఫ్ బరికినట్లు ఇలా బరుకుతుంటే ప్రతిసారి ఆ చెక్కు రిజక్ట్ అవుతుంది. అందుకే నేనే ఆ అథారిటీ కూడా తీసుకున్నా. ఆయన జేబులో డబ్బులు పెట్టుకోరు. డ్రైవర్ దగ్గర నేనే కొంత డబ్బు, ఓ కార్డు పెడతాను అని రమారాజమౌళి తెలిపారు.

    ఎక్కి తొక్కేస్తాం

    ఎక్కి తొక్కేస్తాం

    అంతా కలిసినపుడు రాజమౌళిని పిల్లలంతా కలిసి ఎక్కి తొక్కేస్తారు. ఆయన మీద కాదు, ఆయన సినిమాల మీద. పిల్లలంతా కలిసి ఆయనపై విమర్శలు చేస్తారు. రాజమౌళి బయ పడిపోతాడు. అంతా ఓకే అపార్టుమెంటులో ఉంటాం. ఆదివారం అయితే అంతా కలిసి ఓకే చోట భోజనం చేస్తాం... అని రమారాజమౌళి తెలిపారు.

    English summary
    Rajamouli knew his wife Rama for quite a long time since Rama was music director M. M. Keeravani’s (Rajamouli’s cousin) wife Sreevalli’s younger sister. Rama was already married when the duo first met, and she even had a son. It is said that somewhere around the year 2000, Rama and her then husband filed for a divorce, which led to a bitter settlement but thankfully left her as the sole custodian of her son. During this tough phase of her life, Rajamouli stood by her side, and over the course of time, he realised that the conditions were growing conducive for him to make a proposal to Rama. S.S. Rajamouli finally proposed to Rama around 2001. The Rama Rajamouli marriage was a simple court marriage the same year, which was only attended by close family members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X