»   » అంతర్వేదిలో దిల్ రాజు సినిమా కోలాహలం

అంతర్వేదిలో దిల్ రాజు సినిమా కోలాహలం

Posted By:
Subscribe to Filmibeat Telugu

సఖినేటిపల్లి: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న 'రామరామ..కృష్ణకృష్ణ' చిత్రం షూటింగ్‌తో అంతర్వేది సంక్రాంతి శోభ సంతరించుకుంది. దర్శకు డు శ్రీవాసు ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న రామ్‌, ప్రియానంద్‌, బిందుమాధవి, ప్రేరణలతోపాటు జూనియర్‌ ఆర్టిస్టుల బృందం పై పలు సన్నివేశాలను, పాటలను అంతర్వేది ఆలయం వద్ద చిత్రీకరించారు.

చిత్రంలో రవితేజ సోదరుడు భరత్‌రాజ్‌, బెల్లంకొండ ప్ర వీణ్‌ నటిస్తున్నారు. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ కోసం ప్రభలు, పగటి వేషగాళ్లు, బుట్టబొమ్మలు, రంగులరాట్నాలు, గరగ నృత్యాలు, రంగవల్లులతో ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో ఆలయం వద్ద కోలాహలం సంక్రాంతి ప్రభల తీర్థాన్ని తలపించింది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మూడు రోజులపాటు అంతర్వేదిలో షూటింగ్‌ నిర్వహిస్తామని చిత్ర దర్శకుడు శ్రీవాసు పేర్కొన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu