»   » 'రామయ్యా వస్తావయ్యా'...పెద్ద మార్పులు చెయ్యని రీమేక్

'రామయ్యా వస్తావయ్యా'...పెద్ద మార్పులు చెయ్యని రీమేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Prabhudeva
హైదారాబాద్ : ప్రభుదేవా దర్శకత్వం వహించిన హిందీ చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. గిరీష్‌ కుమార్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటించారు. కుమార్‌ తౌరనీ, రమేష్‌ తౌరనీ నిర్మాతలు. ఈ నెల 19న సినిమా విడుదలవుతుంది. ప్రచార చిత్రాన్ని మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రభుదేవా మాట్లాడుతూ చిత్రం ఖచ్చితంగా హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు.

ప్రభుదేవా మాట్లాడుతూ ''కుమార్‌ నా దగ్గరికి వచ్చి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమా రీమేక్‌ చేద్దామనుకుంటున్నాను.. నువ్వు దర్శకత్వం వహిస్తావా అని అడిగారు. అప్పటి వరకు ఆయనకి ఆ సినిమా దర్శకుడిని నేనే అని తెలియదు. నేను చెప్తే నమ్మలేదు. ఆ తరవాత సినిమా మళ్లీ వేసి టైటిల్స్‌లో చూసి నమ్మారు. నా పనితనం నచ్చే ఆయన నా దగ్గరికొచ్చారు. '' అన్నారు.

అలాగే ''అన్నాచెల్లెలు, తండ్రీకొడుకులు.. తల్లీ బిడ్డల మధ్య భావోద్వేగాలు ఎక్కడైనా ఒక్కటే. అందుకే ఇలాంటి సినిమాలు ఎక్కడికెళ్లినా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయి. ప్రస్తుతం నేను బాలీవుడ్‌లో విజయవంతమైన చిత్రాలు చేస్తున్నాను. అందుకు పునాది తెలుగు చిత్రసీమలోనే ఉంది. ఎందుకంటే నా సినీజీవితం మొదలైంది ఇక్కడే'' అన్నారు.

హీరో గిరీష్ కుమార్ మాట్లాడుతూ... ''రామ్‌గా నా పాత్రని దర్శకుడు బాగా చిత్రించారు. ఈ పాత్ర, సినిమా అందరికి నచ్చుతుంది''అన్నారు గిరీష్‌ కుమార్‌. ఈ కార్యక్రమంలో దిలీప్‌ టాండన్‌ తదితరులు పాల్గొన్నారు. తెలుగు వెర్షన్ లో లేని కొన్ని సీన్స్ ని..హిందీ నేటివిటీ కోసం అక్కడ రచయితను కూర్చోబెట్టి చేసానని ప్రభుదేవా చెప్పారు.

ఇక సోనూ సూద్ అనగానే మనకు పూర్తి స్ధాయి విలన్ కనపిస్తాడు. అయితే త్వరలో తన చెల్లిపై పూర్తి స్ధాయి ప్రేమని పంచే ఎమోషనల్ అన్నగాకనిపించనున్నారు. తాజాగా ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్‌ చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'లో ఓ కీలక పాత్రలో నటించారు. శ్రుతి హాసన్‌కి అన్నగా ఆయన కనిపించబోతున్నారు. తెలుగులో ఆ పాత్రను శ్రీహరి చేసారు.

English summary
Prabhudeva was in Hyderabad promoting his film Ramaiya Vastavaiya. He said that his film is based on the Telugu super hit film Nuvvostantante Nenoddantana (2005) that had Siddharth and Trisha in the lead. The Telugu version was directed by Prabhudeva himself. He has directed the Hindi version with Sruthi Haasan and Girish Taurani with the title Ramaiya Vastavaiya that is scheduled for release on July 19th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu