»   »  ‘అత్తారింటికి దారేది’ పాట విని పూరి జగన్నాథ్‌....

‘అత్తారింటికి దారేది’ పాట విని పూరి జగన్నాథ్‌....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'అత్తారింటికి దారేది' చిత్రంలో పాట విన్న వెంటనే పూరి జగన్నాథ్‌ నాకు ఫోన్‌ చేసి అభినందించడం మరింత ఉత్సాహాన్నిచ్చింది అంటున్నారు రామజోగయ్య శాస్త్రి. ఆయన ఈ చిత్రంలో అమ్మో... బాపు గారి బొమ్మో ఓలమ్మో... మల్లెపూల కొమ్మో
రబ్బరు గాజుల రంగు తీసింది అంటూ రాసారు. ఆ పాట సూపర్ హిట్టైంది. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.


అలాగే... ''కొన్ని పాటలు వినగా వినగా బాగుంటాయి. ఇంకొన్ని మొదటిసారే నచ్చేస్తాయి. అలాంటి పాటల్లో ఇదొకటి. పాటలో తెలుగుదనం చక్కగా కుదిరింది. త్రివిక్రమ్‌గారు సందర్భం చెప్పిన తరవాత.. మూడు నెలల సమయం తీసుకొన్నా. అప్పుడప్పుడూ.. ఒక్కో చరణం రాసుకొన్నా. త్రివిక్రమ్‌ దగ్గర నాకుండే వెసులుబాటు అదే. కావల్సినంత సమయం ఇస్తారు అన్నారు.

ఇక దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన సలహాలూ, సూచనలూ ఈ పాట ఇంత చక్కగా కుదరడానికి దోహదం చేశాయి. కత్తులు లేని యుద్ధం చేసి నన్ను గెలిచింది, మాయలోకంలోకి నన్ను తోసి తలుపులు మూసి తాళం పోగొట్టేసింది, కూరల్లో వేసే పోపు నా వూహల్లో వేసింది, గుండెను గుప్పిట మూసి వూపిరి తీసింది, అందమన్న గంధపు గాలితో మళ్లీ వూపిరి పోసింది - ఇలాంటి అందమైన భావాలు చెప్పగలిగే అవకాశం ఈ పాటతో కలిగింది అని చెప్పుకొచ్చారు.

ఇక ఆ పాట..


పల్లవి: హే... బొంగరాళ్లాంటి కళ్లు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడువంపుల్లో నన్నే తిప్పిందీ
అమ్మో... బాపు గారి బొమ్మో
ఓలమ్మో... మల్లెపూల కొమ్మో
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసిందీ
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్‌ మంక్‌ రమ్మో
పగడాల పెదవులతో పడగొట్టిందీ పిల్లా
కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచిందీ
ఏకంగా ఎద పైనే నర్తించిందీ అబ్బా...
నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది

|| అమ్మో...||

చరణం: మొన్న మేడ మీద బట్టలారేస్తూ...
కూని రాగమేదో తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ
నాజుకైన వేళ్లు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్‌ తీగై ఒత్తిడి పెంచిందే మల్లా హై..
కూరలో వేసే పోపు నా వూహాల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుందీ
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసిందీ
చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసిందీ
పొద్దు పొద్దున్నే హల్లో అంటుంది
పొద్దు పోతే చాలు కల్లో కొస్తుంది
పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది

|| అమ్మో...||

చరణం: ఏ మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసిందీ తాళం పోగొట్టేసిందీ
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగిందీ
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్లీ వూపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజ కుమారి
ఆశలు రేపిన అందాల పోరి
పూసల దండలో నన్నే గుచ్చి మెళ్లో వేసిందీ
|| అమ్మో...||


చిత్రం: అత్తారింటికి దారేది
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
గాయకుడు: శంకర్‌ మహాదేవన్‌
రచన: రామజోగయ్య శాస్త్రి

English summary
Pawan Kalyan and Samantha starrer Atharintiki Dharedhi audio album was launched at Shilpa Kala Vedika in style. Trivikram Srinivas is the director and BVSN Prasad is the producer of the movie. Devi Sri Prasad has composed the music. The movie is expected to be a family entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu