»   » తెలుగు బిగ్‌బాస్‌కు అప్పుడే చిక్కులు: "ఎన్టీఆర్ చేసిన తప్పు అదే"

తెలుగు బిగ్‌బాస్‌కు అప్పుడే చిక్కులు: "ఎన్టీఆర్ చేసిన తప్పు అదే"

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు బిగ్‌బాస్‌కు అప్పుడే చిక్కులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే అత్యంత భారీ రియాలిటీ షోగా ముందుకు వచ్చేందుకు 'బిగ్‌బాస్‌' షో రూపుదిద్దుకుంటోంది. యంగ్‌టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ దాన్ని హోస్ట్‌ చేయబోతున్నారు.

ఈ షో ఈ నెల 16వ తేదీన అది ప్రారంభం కానుంది. అయితే వివాదాలకు నిలయమైన 'బిగ్‌బాస్‌' షో నుంచి ఎన్టీఆర్ తప్పుకోవాలని తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ రామకృష్ణ సూచిస్తున్నారు.

ఈ షో చేయడం ఎన్టీఆర్ కెరీర్‌కు మంచిది కాదని ఆయన అన్నారు.హిందీలో ఎంతో వివాదాస్పదమైన ఈ షోను తెలుగులో చేయాలని కొంతమంది స్టార్‌ హీరోలను అడిగారని, అయితే వారెవరూ అందకు అంగీకరించలేదని ఆయన చెప్పారు.

ఎంతో కష్టపడి...

ఎంతో కష్టపడి...

ఎంతో కష్టపడి బిగ్ బాస్‌ షోను నిర్వహించేందుకు ఎన్టీఆర్‌ను ఒప్పించారని రామకృష్ణ చెప్పారు. ఈ షో చేయాలనే నిర్ణయం తీసుకోవడం ఎన్టీఆర్ చేసిన పెద్ద తప్పు అని, ఈ షో ఎన్టీఆర్‌ను వివాదాలకు కేంద్రబిందువుగా మార్చేస్తుందని ఆయన అన్నారు.

సంప్రదాయానికి వ్యతిరేకం...

సంప్రదాయానికి వ్యతిరేకం...

బిగ్ బాస్ షో మన సాంప్రదాయానికి వ్యతిరేకం కాబట్టి ఎన్టీఆర్‌ను వివాదానికి కేంద్ర బిందువుగా మార్చే ప్రమాదం ఉందని రామకృష్ణ అన్నారు అందుకే సీనియర్, జూనియర్ ఎన్టీఆర్‌ల అభిమానిగా ఈ షోను ఎన్టీఆర్ నిర్వహించకూడదని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

తమిళనాడులో వివాదం...

తమిళనాడులో వివాదం...

ఇటీవల తమిళనాడులో ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌' షో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తమిళ సంప్రదాయానికి వ్యతిరేకంగా అలాంటి షో నిర్వహిస్తున్నందుకు హోస్ట్‌ చేస్తున్న కమల్‌హాసన్‌పై, నిర్వాహకులపై హిందూ మక్కల్ కట్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కమల్ హాసన్ ఘాటుగానే...

కమల్ హాసన్ ఘాటుగానే...

బిగ్‌బాస్‌ను వివాదంలోకి లాగి తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిన ఆందోళనకారులకు కమల్ హాసన్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. తెలుగులో బిగ్ బాస్ నిర్వహణ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల హైదరాబాదులో మీడియాకు వివరించిన విషయం కూడా తెలిసిందే.

Bigg Boss Telugu : List Of Celebrities Participating In NTR's Bigg Boss Show
English summary
Telangana Film Chamber of commerce chairman Ramakrishna suggested Jr NTR not to host Telugu Bigboss reality show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu