»   »  రీతుపర్ణో మృతికి రామానాయుడి సంతాపం

రీతుపర్ణో మృతికి రామానాయుడి సంతాపం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dr.D.Ramanaidu
హైదరాబాద్ : ప్రముఖ బెంగాలీ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత రీతూపర్ణో ఘోష్ మృతి పట్ల ప్రముఖ తెలుగు నిర్మాత రామానాయుడు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేసారు. రీతూపర్ణో ఘెష్ ఎంతో ప్రతిభగల దర్శకుడని, తమ సురేష్ ప్రొడక్షన్ సంస్థ బెంగాలీ భాషలో 1999లో నిర్మించిన తొలి సినిమా 'Asukh' చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారని వెల్లడించారు.

1999లో విడుదలైన ఈ చిత్రం 46వ జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు సొంతం చేసుకుందని రామానాయుడు తెలిపారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని, ఆయన కుటుంబానికి ప్రగాడ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీని రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

కోల్‌కతాలో పుట్టిపెరిగిన రీతూపర్ణో ఘోష్ ఆర్ట్ సినిమాలు తీయడంలో ప్రఖ్యాతిగాంచారు. 19 ఏళ్ల ఆయన సినీ ప్రస్థానంలో ఇప్పటికు 12 జాతీయ అవార్డులను దక్కించుకున్నారు. 'చిత్రాంగద' అనే చిత్రానికి గాను గతేడాది కూడా ఆయనకు జాతీయ అవార్డు అందుకున్నారు.

English summary
Dr.D.Ramanaidu Film Producer conveys his condolence on the sad demise of Sri. Rituparno Ghosh Bengali director. Rituparno Ghosh has directed our 1stBengali film Asukh in the year 1999 under Suresh Production banner. The Film Asukh has won the Best Film Award on 46thNational Film festival Award.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu