twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామానాయుడు దర్శకత్వంలో దగ్గుపాటి రాణా

    By Srikanya
    |

    హైదరాబాద్: తాత దర్శకత్వంలో దగ్గుపాటి రానా నటించనున్నారా..అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. అంతేకాదు ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత రామానాయుడు కూడా కొంచెం అటూగా ఖరారు చేసారు. ఆయన రీసెంట్ గా పంజాబిలో నిర్మించిన సింగ్ వెర్శస్ కౌర్ చిత్రం విజయవంతమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఆయన దర్శకత్వంలో రానా హీరోగా పునర్ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్లు మీడియాకు తెలియచేసారు. ఇక ఇప్పటికే సత్యానంద్ ఈ చిత్రం స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

    రామానాయుడు మాట్లాడుతూ... " పంజాబ్ భాషలో మేం తీసిన చిత్రం హిట్టైంది. అది యూనవర్శల్ సబ్జెక్ట్. ఏ భాష వారైనా ఆ సబ్జెక్టుకి కనెక్టు అవుతారు. ఈ చిత్రంలో రానా ని హీరోగా పెడదామనుకుంటున్నాను. అయితే ఇప్పటివరకూ రానా కి ఈ చిత్రం చూపించలేదు. అలాగే వెంకటేష్ కొడుకు కూడా ఈ చిత్రంలో చేద్దామనకుంటున్నాను. అన్నీ కలిసి వస్తే...నేనే ఈ సబ్జెక్టుని డైరక్ట్ చేస్తాను. నేను నా దర్సకత్వం లాంచ్ అవటం కోసం చాలా కాలంగా మంచి సబ్జెక్ట్ కోసం వెతుకుతున్నారు. చాలా కాలంగా నేను ఎదురుచూస్తున్న కల దర్సకత్వం. అన్నీ అనుకూలిస్తే రానాని నేను డైరక్ట్ చేస్తాను" అన్నారు.

    ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం 'బహుబలి'లో దగ్గుబాటి యువ హీరో రాణా నెగెటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని తనకు తానుగా అఫీషియల్ గా ప్రకటించుకున్నాడు రాణా. తన ట్విట్టర్ పేజీలో ఈ విషయమై ప్రస్తావిస్తూ...... ప్రభాస్ సోదరుడి పాత్రలో నెగెటివ్ రోల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

    అలాగే కాకతీయుల చరిత్ర ఆధారంగా రూపొందుతున్న రుద్రమదేవి చిత్రంలో చాళుక్య వీరభద్రుడిగా రానా కనిపించనున్నారు. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా గుణశేఖర్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

    English summary
    Ramanaidu revealed that he will be directing his grandson Rana. If it happens then it will be the first time grandfather and grandson is doing a film together. Speaking about the film he said, “I decided to make his Punjabi movie which was released recently and proved hit in Telugu as the story is universal and will connect with any kind of audience. I want to cast Rana in the movie, but I haven’t shown him the film yet. I’m even considering casting Venkatesh (Ramanaidu’s son) for the movie.” Buzz is Satyanand is already working on the script. Saying that he will be directing the film, Ramanaidu said, “If all goes well, I would like to direct this movie myself. For the last couple of years, I have been looking for a good story to make my directorial debut. It is a long pending dream of mine.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X