twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామా నాయుడు ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తరగతులు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : భారతీయ సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ....రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ఈ సంవత్సరం పలు కోర్సుల్లో శిక్షణ తరగతులు ప్రారంభించబోతోంది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసారు. జూన్ 1 నుంచి మొదలయ్యే ఈ తరగతులు 5 వారాల పాటు కొనసాగనున్నాయి.

    ఒక్కో వారం ఒక్కో కోర్సులో శిక్షణ తరగుతులు ఉంటాయని, జూన్ 1 ఫిల్మ్ లాంగ్వేజ్, జూన్ 8న ఫిల్మ్ ఫార్మ్ అండ్ స్టైల్, జూన్ 15న సినిమాటోగ్రాఫిక్ స్టైల్ అండ్ సౌండ్ డిజైన్, జూన్ 22న బేసిక్ విజువల్ కంపోనెంట్స్, జూన్ 29 ప్లాట్ స్టక్చర్ అండ్ జేనర్లో శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.

    విద్యార్థులకు రూ. 2500, ఇతరకులకు రూ. 5000 వరకు ఫీజు ఉంటుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు ఉంటాయి. పూర్తి వివరాలకు 9177757577, 8374610196 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.ramanaidufilmschool.net పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

    భారత దేశ సినిమాకి జీవితకాలం చేసిన సేవలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తో గౌరవించబడిన డాక్టర్ డి.రామానాయుడు గారు 2008 లో రామానాయుడు ఫిల్మ్ స్కూల్ ను రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ కి అనుబంధంగా ప్రారంభించడం జరిగింది. ఈ ఫిల్మ్ స్కూల్ ప్రారంభించిన నాటి నుండి ఇప్పటివరకు సురేష్ ప్రొడక్షన్ సి.ఇ.ఓ. డి. సురేష్ బాబు తను విస్త్రుత అనుభవలతో ఎప్పటికప్పుడు అన్నీ విభాగాల్లోనూ మార్గనిర్దేశకత్వం చేస్తూ వస్తున్నారు.

    రామానాయుడు ఫిల్మ్ స్కూల్ మూడు ప్రధాన ఉద్దేశాలతో ప్రారంభించబడింది. 1 రామానాయుడు స్టూడియో నుండి గాని సురేష్ ప్రొడక్షన్ నుండి గాని కొంతైనా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి కి ఉపయోగాపడే విధంగా ఏదో ఒకటి చేయాలి.2 . ప్రతిభ వున్నా స్థానికులకు నాణ్యమైన శిక్షణ పొందే అవకాశం కల్పించడం. 3 . ఇలాంటి శిక్షణ పొందిన వారి ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రి స్థాయిని పెంచేవిధంగా ప్రయత్నిచడం.

    మొదట ఒక్క డైరక్షన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లోమో ప్రారంభించడం జరిగింది. తరువాత విజయవంతంగా సినిమాటోగ్రఫీ లో పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మరియు యాక్టింగ్ లో డిప్లొమా కోర్స్ లు ప్రారంభించాము. మరింతగా స్థాయిని పెంచుతూ జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ అనుబందంతో ఫిల్మ్స్ & టెలివిజన్ డైరెక్షన్ లో మాస్టర్స్ డిగ్రీ , ఫిల్మ్స్ & టెలివిజన్ సినిమాటోగ్రఫీ లో మాస్టర్ డిగ్రీ ని మరియు యాక్టింగ్ లో డిప్లొమాని అందిస్తున్నారు.

    English summary
    Ramanaidu Film School Film Appreciation course will be on every Saturday starting from June 1st 2013 for five weeks.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X