»   » సురేష్ ప్రొడక్షన్స్ చిత్రంలో వరుణ్ సందేశ్

సురేష్ ప్రొడక్షన్స్ చిత్రంలో వరుణ్ సందేశ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుణ్ సందేశ్ త్వరలో రామానాయుడు నిర్మించనున్న కొత్త చిత్రంలో చేయనున్నారని సమాచారం. మీ శ్రేయోభిలాషి, మనోరమ చిత్రాలను డైరక్ట్ చేసిన ఈశ్వర రెడ్డి ఈ కొత్త చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఇక బెండు అప్పారావు ఇచ్చిన విజయోత్సాహంలో రామానాయుడు ఈ చిత్రాన్ని ప్యామిలి ఎంటర్టైనర్ గా నిర్మించాలని ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుందని చెప్తున్నారు. ఈశ్వర రెడ్డి రెండు చిత్రాల్లో మొదటి చిత్రం మంచి పేరు తీసుకురాగా, రెండవదైన మనోరమ పెద్ద ఫ్లాప్ చిత్రంగా భాక్సాఫీస్ వద్ద నమోదైంది. అలాగే వరుణ్ సందేశ్ చేసిన కుర్రాడు చిత్రం పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా వరుణ్ సందేశ్ ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న మరో చరిత్ర రీమేక్ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu