Just In
Don't Miss!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- News
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నిక
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గేట్లు మూసారు: ఫ్యాన్స్‌కు దక్కని రామానాయుడి చివరి చూపు
హైదరాబాద్: రామానాయుడు స్టూడియోలో ఈ రోజు ఉదయం నుండి రామానాయుడు భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అయితే మధ్యాహ్నం నాటికి అభిమానుల తాకిడి ఎక్కువైంది. వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. స్టూడియో లోపల అందుకు తగిన స్థలం లేక పోవడంతో గేట్లు మూసేసారు. దీంతో చాలా మంది అభిమానులు ఆయన చివరి చూపు చూడకుండానే వెనుదిరిగారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
శతాధిక చిత్రాల నిర్మాత... మూవీ మొఘల్‌గా పేరుగాంచిన దగ్గుబాటి రామానాయుడు (79) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం 2.30గంటలకు హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాసవిడిచారు.

రామానాయుడు అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి రామానాయుడు స్టూడియోకు చేరుకుంది. రామానాయుడు భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం వరకు రామానాయుడు స్టూడియోలో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు రామానాయుడు భౌతికకాయాన్ని ఉంచే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామానాయుడు పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చారు.
అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం తర్వాత రామానాయుడు స్టూడియోలో నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో రామానాయుడు పార్థీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.