»   » ఇక బుల్లి తెరపై కంటిన్యూగా రంభ చిందులు

ఇక బుల్లి తెరపై కంటిన్యూగా రంభ చిందులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రంభ త్వరలో ఈటీవీ ఛానెల్ రెగ్యులర్ గా కనిపించటానికి ఎగ్రిమెంట్ కుదుర్చుకుందని సమాచారం. ఈటీవీలో పాపులర్ అయిన ఢీ పోగ్రామ్ కి ఆమె జడ్జిగా రానుంది. అయితే ఈ డీ పోగ్రామ్ లేడీస్ స్పెషల్ గా రూపొందిస్తున్నారు. ఏప్రియల్ మొదటి వారం నుంచి ప్రతీ గురువారం రాత్రి 9:30 నుంచి 10:30 వరకూ ఈ పోగ్రాం వస్తుందని చెప్తున్నారు. అలాగే ఈ పోగ్రామ్ లో యాంకర్ గా ఉదయభాను వ్యవహిస్తుంది. బ్రాండ్ అంబాసిడర్ గా శ్రియను అడుగుతున్నారు. మొత్తానికి ఈ పోగ్రామ్ కి పూర్తి స్ధాయి సినిమా హంగులు అద్ది రేటింగ్ లు పెంచే ప్రయత్నంలో ఉంది యాజమాన్యం. ఇక రంభ వివాహం కూడా ఏప్రియల్ ఎనిమిదిన తిరుపతి లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక రంభను ఈ పోగ్రామ్ కి తీసుకోవటానికి కారణం గ్లామర్ అనేదే కాక ఆమె డాన్స్ ప్రావీణ్యం కూడా అని తెలుస్తోంది. అంటే పోగ్రామ్ లో రంభ నృత్యాలు స్పెషల్ గా ఉంటాయన్న మాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu