మాధురి దీక్షిత్ బాటలో రంభ
వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన తారలు...పెళ్లి త్వరాత సినిమాలకు దూరం అవుతున్నారు. వీరిలో కొందరు శాశ్వతంగా తెరమరుగైఃపోతే, మరి కొందరు మాత్రం మళ్లీ సినిమాల్లోకి వచ్చి తమ సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ లో ఇలాంటివి కనిపించవు కానీ, బాలీవుడ్ లో మాత్రం ఈ పోకడలు ఎక్కువే. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ విషయానికొస్తే...ఓ రిచ్ డాక్టర్‌ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి పోయిన మాధురి మళ్లీ బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. శిల్పాశెట్టి కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై దోస్తానా సినిమాలో ఐటం గర్ల్ గా రీఎంట్రీ ఇచ్చింది.
వీరి బాటాలోనే తెలుగు హీరోయిన్ రంభ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధం అవుతోంది. రంభ చేసే ఐటం సాంగులకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో చాలా మంది దర్శక నిర్మాతలు ఇప్పటికే ఆమె వెంట పడుతున్నారు. అయితే ఎట్టకేలకు వారి శ్రమ ఫలించినట్లే కనిపిస్తోంది. తిరిగి సినిమాల్లో నటించడానికి రంభ సుమఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కెనడాలో సెటిలైన ప్రవాస భారతీయుడు, వ్యాపారి అయిన ఇంద్రకుమార్ ను రంభ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరికి ఓ పాప జన్మించింది. ప్రస్తుతం చిన్నారి ఆలనా పాలనలో రంభ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











