»   » రంభ ఫ్యామిలీ విషయం: కొత్త ట్విస్ట్...స్వయంగా రంభ మీడియాతో

రంభ ఫ్యామిలీ విషయం: కొత్త ట్విస్ట్...స్వయంగా రంభ మీడియాతో

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: అమలాపాల్ డైవర్స్ విషయం మరవక ముందే మాజీ హీరోయిన్ రంభ కుటుంబ వ్యవహారం ముందుకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. తెలుగు,తమిళ పరిశ్రమల లో ఓ వెలుగు వెలిగిన నటి రంభ వైవాహిక జీవితం ప్రస్తుతం సందిగ్దంలో పడిందంటూ తమిళ, తెలుగు మీడియాలో నిన్న వార్తలు గుప్పుమన్నాయి.

అయితే తన భర్తతో విడిగా ఉంటున్నానంటూ వస్తున్న వార్తలన్నీ రూమర్సే అంటూ కొట్టి పారేస్తోంది రంభ. తను ఏమీ విడాకులకు అప్లై చేయలేదని తన వైవాహిక జీవితం అంతా బాగానే ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ..."నేను ఇప్పుడే మా సోదరుడు ద్వారా ఈ రూమర్ గురించి విన్నాను..నేను డైవర్స్ కు అప్లై చేసానంటున్నారు.. కోర్టుకి వెళ్ళటం చూసారా.. అలాగే నాకు ఇద్దరు పిల్లలు, నా పెద్ద కూతురుని స్కూల్ నుంచి పికప్ చేసుకోవటానికి వెళ్తున్నాను. నా వైవాహిక జీవితం చాలా బాగుంది.," అంటూ ఆమెను సంప్రదించిన ఓ ఇంగ్లీష్ డైలీకు చెప్పుకొచ్చారు.

Rambha rubbishes divorce rumours, says all is well in her marriage

ఇక రంభ విషయమై మీడియాలో వచ్చిన న్యూస్ క్రింద చదవండి...

గత కొన్ని నెలలుగా రంభ తన భర్త ఇంద్రన్ పద్మనాథన్ నుంచి విడిగా ఉంటోంది. రంభ దంపతులకు ఇద్దరు పిల్లలు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తనకు భర్తతో కలిసి జీవితాన్ని మళ్లీ పంచుకోవాలని ఉందని, అందుకు అవకాశం కల్పించాలని కోరుతూ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.

ఇక వివాహానంతరం కెనడా వెళ్లిన తనకు అత్తింటివారి నుంచి పలు సమస్యలు ఎదురయ్యాయని, ఆస్తి కోసం భర్త, అత్త తదితరులు ఒత్తిడి చేశారని ఆరోపించారు. కెనడాలో పెద్ద కుమార్తెను తాను కిడ్నాప్‌ చేసినట్లు కూడా తనపై కేసు పెట్టి సతాయించారని పేర్కొన్నారు.

తాను ఇండియా వచ్చినప్పటి నుంచి భర్త తనకు దూరమయ్యాడని, అందువల్ల తన భర్తతో దాంపత్య హక్కుల్ని పునరుద్ధరించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. వారికి లావణ్య (5), ఏడాదిన్నర వయసున్న సాషా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. లావణ్య చెన్నైలోనే చదువుతోంది.

ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో తాను భర్తతో కలిసి ఉండాలనుకున్నట్లు పేర్కొంది. హిందూ వివాహచట్టంలోని సెక్షన్ 9 ప్రకారం తనకు హక్కులు కల్పించాలని కోరింది. వచ్చే డిసెంబర్‌ 3న రంభ కేసు విచారణకు రానుంది.

English summary
Rambha has denied rumours of a rift in her relationship with her husband Indran Pathmanathan. The actress has clarified that the couple has not filed for divorce and everything is fine in her marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu