»   » రంభ ఓపెన్ గా చెప్పేసింది: ఆయనతోనే ఉంటాను ఎందుకని అడక్కండి అంటూ

రంభ ఓపెన్ గా చెప్పేసింది: ఆయనతోనే ఉంటాను ఎందుకని అడక్కండి అంటూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నా భర్తతో కలిసుండే అవకాశం ఇప్పించండి.. నెలకి రెండున్నర లక్షల రూపాయల్ని నా భర్త నుంచి ఇప్పించండి..' అంటూ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఒకప్పటి హీరోయిన్‌ రంభ. భర్త ఇంద్రన్‌తో విభేదాల కారణంగా ఆయనకు దూరమైంది రంభ. ఏమయ్యిందో, మళ్ళీ ఇప్పుడు 'రీ-యూనియన్‌' కోరుకుంటున్న రంభ, న్యాయస్థానాన్ని ఆశ్రయించి అందర్నీ విస్మయానికి గురిచేసింది.

భర్త నుంచి నెలకు రెండున్నర లక్షల రూపాయలు మెయిన్‌టెనెన్స్‌ కోసం రంభ కోరిందంటే, విషయం చాలా పెద్దదే అయి వుండాలి. కానీ, రంభ మాత్రం చాలా లైట్‌ తీసేసుకుంది. ఇక, సినిమాల్లో రీ-ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాననీ, అయితే మెయిన్‌ హీరోయిన్‌గా ఛాన్సొస్తేనే నటిస్తాననీ అంటోంది రంభ. కానీ ఇద్దరి మధ్యా వచ్చిన చిన్న గొడవల వల్లే విడిపోవాలనుకున్నానటూ చెప్పింది. అయితే ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసేసుకుంది... అదేమిటో ఆమె మాటల్లోనే....

సంసారంలో ఇటీవల గొడవలు:

సంసారంలో ఇటీవల గొడవలు:

2010 ఏప్రిల్ లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్‌ ను పెళ్లి చేసుకుంది రంభ. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఆరేళ్లపాటు హాయిగా సాగిన వీళ్ల సంసారంలో ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా కెనడా నుంచి చెన్నై వచ్చిన రంభ.. ఇక్కడే ఉంటుంది.

చెన్నై ఫ్యామిలీ కోర్టు:

చెన్నై ఫ్యామిలీ కోర్టు:

భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. భర్త ఇంద్రన్‌ విడాకులు కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రంభ మాత్రం డైవర్స్ వద్దని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఓ పిటీషన్ దాఖలు చేసింది. భర్తతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

భర్తతో విడాకులు వద్దని:

భర్తతో విడాకులు వద్దని:

హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం తనకు హక్కులు కల్పించాలని కోరింది. భర్తతో విడాకులు వద్దని.. కలిసే ఉండేందుకు అవకాశం కల్పించాలని విజ్ణప్తి చేసింది. నా భర్తతో నేను విడిపోవడానికి ప్రధానకారణం నా అత్తింటివారు. వాళ్ళు నన్ను చాలా హెరాస్‌ చేశారు.

ఆస్తి రాసివ్వమంటూ :

ఆస్తి రాసివ్వమంటూ :

నా పేరనున్న ఆస్తి రాసివ్వమంటూ నన్ను ఒత్తిడి చేసేవారు. చివరగా నా పెద్ద కూతుర్ని నేనే కిడ్నాప్‌ చేయించినట్టు కేసు కూడా పెట్టారు. ఏ తల్లయినా కూతుర్ని కిడ్నాప్‌ చేస్తుందా? ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకున్నాను. కానీ ఈ కేసుతో నా మనసు విరిగిపోయింది. అప్పటికి నా చిన్న కూతురు పుట్టి కొన్ని నెలలే అయింది. ఇద్దరు చంటి పిల్లల్ని తీసుకొని ఇండియాకి వచ్చేశాను. సినీ పరిశ్రమ నన్ను మళ్ళీ ఆదరిస్తుందన్న నమ్మకంతోనే తిరిగి వచ్చాను.

ఇంద్రన్‌ నా సర్వస్వం అనుకున్నాను:

ఇంద్రన్‌ నా సర్వస్వం అనుకున్నాను:

ఇంద్రన్‌తో నా వివాహం సరైన సమయంలోనే జరిగింది. హీరోయిన్‌గా చేస్తుండగానే తనతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. అప్పట్లో ఇంద్రన్‌ నా సర్వస్వం అనుకున్నాను. తను లేకపోతే నేను లేను. అంతలా తనని ప్రేమించాను. పెళ్ళయిన కొత్తల్లో అత్తింటి వారు ఇబ్బంది పెట్టినా మేం మాత్రం బాగా ఉండేవాళ్ళం.

తారాస్థాయికి:

తారాస్థాయికి:

రెండో పాప పుట్టిన తరువాత అత్తింటి వేధింపులు తారాస్థాయికి చేరాయి. దాంతో మా మధ్య విభేదాలు మొదలయ్యాయి. మా మధ్య సఖ్యత కుదిర్చేవారి కన్నా మంట పెట్టేవారే ఎక్కువయ్యారు. దాంతో మా మధ్య దూరం పెరిగిపోయింది. ఇక తనతో కలిసి ఉండలేక కెనడా వదిలి ఇద్దరు పిల్లలతో చెన్నై వచ్చేశాను.

 విధిలేని పరిస్థితిలో :

విధిలేని పరిస్థితిలో :

ఇక్కడికి రాగానే అవకాశాలు వస్తాయని ఏమీ ఊహించలేదు కానీ, కొద్దిగా ఆలస్యం అయినా నన్ను మళ్ళీ ఆదరిస్తారని అనుకున్నాను. కానీ నా అంచనా తప్పయింది. దాంతో విధిలేని పరిస్థితిలో భరణం కోసం కోర్టు మెట్లు ఎక్కాను. అదీ నా పిల్లల కోసమే తప్ప నా కోసం కాదు.

ఎవరి ప్రమేయం లేదు:

ఎవరి ప్రమేయం లేదు:

నా భర్తతో విడిపోవాలని తీసుకున్న నిర్ణయం పూర్తిగా నా సొంతం. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఎవరి మాటలు విని నేను ఈ పని చేయలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. అప్పుడు నేను ఆవేశంలో ఉండి తనతో బంధం తెంచుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు తిరిగి తనతో జీవించాలని అనుకుంటున్నాను. ఎందుకో ఆ ఒక్కటీ అడక్కండి!

English summary
Rambha, one of the top glamorous actresses in late 90's and early 2000's, has been living separately from husband. Now she seeks reunion with her husband Indhran
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu