»   » 'మగధీర' డైలాగు : రామ్ చరణ్, రానా కలిసి (డంబ్ స్మాష్ వీడియో)

'మగధీర' డైలాగు : రామ్ చరణ్, రానా కలిసి (డంబ్ స్మాష్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్, రానా చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. షూటింగ్ లేకపోతే ఇద్దరూ కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూంటారు. రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసినప్పుడు ఓ అల్లరి డంబ్ స్మాష్ వీడియోని చేసారు. అదే మీరు ఇక్కడ చూడబోయేది.

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో రీసెంట్ గా ఓ కొత్త ఒరవడి మొదలైంది. సోషల్ నెట్ వర్కింగ్ ప్రియుల కోసం వచ్చిన కొత్త సాధనం 'డంబ్‌ స్మాష్‌'. దీన్ని ఉపయోగించి సినిమాల్లో బాగా ప్రాచుర్యం పొందిన సంభాషణలకు తమ ముఖాన్ని అరువిచ్చి చిన్న చిన్న వీడియోలు రూపొందించొచ్చు.బాలీవుడ్‌లో ఈ ఆప్‌కు మంచి స్పందన వస్తోంది.

టాలీవుడ్ కూ ఇది పాకింది. మొన్న పోకిరిలో డైలాగులతో మహేష్ తన కొడుకుగౌతమ్ వీడియోని వదిలారు. తర్వాత దర్శకుడు సుకుమార్ తన కుమారుడు వీడియోని విడుదల చేసారు. తాజాగా రామ్ చరణ్, రానా కలిసి మగధీర లోని డైలాగుతో కలిసి ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది. మీరు ఇక్కడ ఆ వీడియోని చూడవచ్చు.


రామ్ చరణ్ తాజా చిత్రం విషయానికి వస్తే...

రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ ఖరారు కాలేదు. రోజుకో టైటిల్ ప్రచారంలోకి వస్తోంది. మీడియాలో రకరకాల టైటిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే.. ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ గత కొంత కాలంగా ప్రచారంలో ఉంది. ఆ తర్వాత ‘బ్రూస్ లీ' అనే టైటిల్ కూడా ప్రచారంలో కి వచ్చింది. అలాగే ఇప్పుడు సుప్రీమ్ అనే టైటిల్ వినపడుతోంది. చిరంజీవికి,రామ్ చరణ్ కు ఈ టైటిల్ నచ్చిందని, ఈ టైటిలే ఫైనలైజ్ చేసే అవకాసం ఉందని సమాచారం. గతంలో చిరంజీవిని సుప్రీం స్టార్ అని పిలిచిన విషయం గుర్తుండే ఉండి ఉంటుంది.

Ramcharan and Rana Dubsmash

నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ నేటి నుంచి (3 rd జూన్) హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో నాయికగా 'రకుల్ ప్రీత్ సింగ్' రాంచరణ్ సరసన తొలిసారిగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ గత నెల 21 నుంచి 30 వరకు మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', రకుల్ ప్రీత్ సింగ్ ల పై 'యూరప్' లో పాటల చిత్రీకరణ జరిగింది. తిరిగి ఈరోజు (జూన్ 3 ) నుంచి హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో పాటు కృతి కర్బంద, తనికెళ్ళ భరణి, రావురమేష్, పవిత్రలోకేష్, సప్తగిరి, రవిప్రకాష్ ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు

‘నాయక్' తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

Ramcharan and Rana Dubsmash

డైరెక్టర్ 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ ‘ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నటీ,నట వర్గం: రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, నదియ, కృతి కర్బంద, తనికెళ్ళ భరణి, ముఖేష్ రుషి, రావురమేష్, షాయాజీ షిండే, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజి, పృథ్వి, సప్తగిరి, కారుమంచి రఘు, రవిరాజ్, సత్య, రవిప్రకాష్, సురేఖావాణి, పవిత్రలోకేష్, కష్మీరష తదితరులు. ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం; తమన్ ఎస్.ఎస్., కెమెరా: మనోజ్ పరమహంస, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, స్టంట్స్: అనల్ అరసు. లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ సమర్పణ : డి. పార్వతి నిర్మాత : దానయ్య డి.వి.వి. మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల.

English summary
Ramcharan and rana dubmashing magadheera dialogue released.
Please Wait while comments are loading...