»   »  రామ్ చరణ్ 'ధీరుడు' కాదుట!మరి...

రామ్ చరణ్ 'ధీరుడు' కాదుట!మరి...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ramcharan Tej
రామచరణ్,కాజోల్ కాంబినేషన్లో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న చిత్రానికి ఇన్నాళ్ళూ ధీరుడు అనే టైటిల్ నానుతూ వచ్చింది. అయితే రాజమౌళి తన చిత్రానికి ధీరుడు...వీరుడు లాంటి పేర్లేమి లేవని ప్రకటించాడు. అయితే మరి ఏం టైటిల్ పెట్టబోతున్నాడు అంటే డేగ ...ద పవర్ ఫుల్ వెపన్ అనేది వినపడుతోంది. ఫిలిం ఛాంబర్ లో ఈ పేరుతో రాజమౌళి ఓ టైటిల్ ని రీసెంట్ గా రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సినీ ఫైట్ మాస్టర్ గా కనిపిస్తాడు.

అలాగే ఈ కథ నాలుగు వందల ఏళ్ళ క్రిందట మొదలయ్యే లవ్ స్టోరీ. అప్పట్లో ఆ ప్రేమ కథ అంసంపూర్తిగా ముగిసిపోతుంది. మళ్ళీ ఇప్పటి కాలంలో ఈ జంట మళ్ళీ ప్రేమలో పడతారు. అయితే ఈ సారి మరికొన్ని కొత్త సమస్యలు వస్తాయి. గతంలో వారి ప్రేమకు అడ్డుపడ్డ శ్రీహరి ఈ జన్మలో వారికి సహకరిస్తాడు. ఈ సినిమాలో కత్తి ఫైట్ ఎపిసోడ్ అధ్బుతంగా చిత్రీకరించారుట. అలాగే బంగారుకోడి పెట్ట పాటలో చిరంజీవి కనపడటం హైలెట్ అవుతుందనేది దర్శక,నిర్మాతల నమ్మకం. ఇక డేగ ...ద పవర్ ఫుల్ వెపన్ టైటిల్ అన్నా మార్చకుండా అధికారికంగా ప్రకటిస్తారమో చూద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X