»   » బాలకృష్ణతో సినిమా ఆగిపోవటానికి కారణం నేనే అంటున్న దర్శకుడు

బాలకృష్ణతో సినిమా ఆగిపోవటానికి కారణం నేనే అంటున్న దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజానికి బాలయ్య కోసం సిద్దం చేసుకున్న కథ ఇది. 'భీష్మ" పేరుతో ప్రాజెక్ట్‌ సైతం అనౌన్స్‌ చేసాం. అయితే ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చకపోవడానికి కారణం నేనే. నా మూడో సినిమాకే బాలకృష్ణ వంటి టాప్‌స్టార్‌ను డైరెక్ట్‌ చేయగలనా అనే భయంతో నేనే డ్రాప్‌ అయిపోయాను అంటున్నారు రమేష్ వర్మ. ఆయన తన తాజా చిత్రం వీర గురించి మాట్లాడుతూ..అలాగే.. అదే కథను స్వల్ప మార్పులుచేర్పులతో రవితేజతో చేసాను. 'భీష్మ" టైటిల్‌ 'వీర"గా మార్చాను అని చెప్పుకొచ్చారు. అప్పట్లో బాలకృష్ణ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ 'భీష్మ"టైటిల్ ఎనౌన్స్ చేసి ఆపుచేసారు. అంతకుముందు అదే బ్యానర్ లో రమేష్ వర్మ చిన్న హీరోలతో రైడ్ అనే హిట్ చిత్రం ఇచ్చారు. దాంతో బెల్లంకొండ ఈ ఆఫర్ ఇచ్చారు. కానీ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. ఇక ఈ కథను విన్న రవితేజ ఆసక్తి చూపించి పూర్తి చేయటంతో సినిమా తెరకెక్కింది. రవితేజ హీరోగా శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై గణేశ్ ఇందుకూరి నిర్మించిన 'వీర' చిత్రానికి ఆయన దర్శకుడు. ఈ నెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

English summary
Producer Bellamkonda Suresh hurriedly announced a film with Balakrishna few months back,he even performed a Pooja for the movie which was said to be titled “Bheeshma” halted.At That time Balakrishna who saw Ramesh Varma directed Ride and expressed his willingness to act under his direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu