»   »  బిగ్ బికి వర్మ క్షమాపణలు

బిగ్ బికి వర్మ క్షమాపణలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ramgopal Verma
వరస అపజయాలు వర్మలో మార్పు తెస్తున్నట్లున్నాయి. తాజాగా ఆయన తన శైలికి భిన్నంగా అమితాబ్‌కు క్షమాపణలు చెప్పారు. 'సర్కార్ రాజ్' చిత్రం ప్రచార కార్యక్రమంలో ఈ విశేషం జరిగింది. "నేను మీతో తీసిన 'నిశ్శబ్ద్', 'రామ్‌గోపాల్ వర్మా కీ ఆగ్' సినిమాలు ఫ్లాపవడానికి నాదే బాధ్యత. అందుకు మీకు సారీ చెబుతున్నా" అని వినమ్రంగా వర్మ అన్నారు. దీనికి అమితాబ్ స్పందిస్తూ "ఈ ప్రపంచంలో విమర్శలు, ఫెయిల్యూర్స్‌ అనేవి నిర్మాతలకూ ,దర్శకులకూ కామన్ అంటూ... వైఫల్యం మన జీవితాల్లో ఒక భాగం అని దాన్నుంచి నేర్చుకోవడానికే నేను ప్రయత్నిస్తా" అన్నారు. 'సర్కార్ రాజ్' తమ కాంబినేషన్ లో వచ్చిన ప్రీవియస్ హిట్ ఫిల్మ్ 'సర్కార్'కు సీక్వెల్‌గా వర్మ రూపొందిస్తున్నారు. ఐష్ వివాహం తర్వాత తొలిసారిగా బిగ్ బి కుటుంబం (అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య) అంతా కలిసి కనిపించబోతున్న చిత్రం ఇది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X