తిరిగి మాట్లాడలేకపోతున్నాను... : రాంగోపాల్ వర్మ
దర్శకుడు రాంగోపాల్‌వర్మ తమిళంలోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్ ప్రధానపాత్రలో రూపొందుతున్న సత్య 2 చిత్రాన్ని 'నాందాండా' టైటిల్ తో తమిళంలో అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి తమిళ మీడియాతో మాట్లాడారు.
అలాగే నా తొలి చిత్రం 'శివ' తమిళంలో 'ఉదయం' పేరిట విడుదలై విజయం సాధించింది. అప్పుడే నేరు తమిళ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించాను. భాషపై అవగాహన లేకుండా సినిమా చేయటం నాకు ఇష్టం లేదు అన్నారు.
ఇక వైవిధ్య ప్రయత్నాలకు ఎప్పుడూ తమ ఆదరణ ఉంటుందని తమిళ ప్రేక్షకులు ఇప్పటికే నిరూపించారు. వారిపై నమ్మకంతోనే 'నాందాండా' తెరకెక్కిస్తున్నాను. ఇక్కడివారిని అలరిస్తుందనే నమ్మకముంది అని విశ్వాసం వ్యక్తం చేసారు.
తమిళ ట్రెండ్ గురించి చెప్తూ... తమిళంలో ప్రస్తుతం వైవిధ్య చిత్రాల జోరు నడుస్తోంది. ముఖ్యంగా కొత్త దర్శకులు కథను నడిపించే తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన 'సుబ్రమణ్యపురం', 'పిజ్జా', 'అరణ్యకాండం' కొత్త ప్రయోగాలని చెప్పొచ్చు అన్నారు.
నా చిత్రాల్లో ఎక్కువ శాతం యధార్థ సంఘటనల ఆధారంగా తీసినవే. రౌడీలు, నేరస్థులు, పంచాయితీలు, వర్గపోరుల ఆధారంగా చాలా కథలు తెరకెక్కించాను. ముంబయిపై ముష్కరుల దాడి నేపథ్యంలో ఇటీవల హిందీ చిత్రాన్ని అందించాను. యధార్థ సంఘటనలకు తెరరూపం ఇవ్వటమన్నది సవాలుతో కూడుకున్నదే. ఆ సవాళ్లను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












