»   » వర్మా..! జర జాగ్రత్త : నిజం గ్రహించకుంటే మిగిలేది చరిత్రే

వర్మా..! జర జాగ్రత్త : నిజం గ్రహించకుంటే మిగిలేది చరిత్రే

Posted By:
Subscribe to Filmibeat Telugu

వర్మ ఇండియన్ సినిమాకి ఒక యూనిక్ డైరెక్టర్ సినిమా అంటే ఇలా కూడా తీయొచ్చు అంటూ డైరెక్టర్ల దృషీని మార్చేసిన సిన్మా శివ. ఆ ఒక్క సినిమా తో ఓవర్నైట్ స్టార్ అయిపోయిన వర్మ ఒక రేంజ్ లో దూసుకు పోతాడనే అర్థమయ్యింది ఇండస్ట్రీ కి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించింది టాలీవుడ్. అయితే కొన్ని కారణాలవల్ల టాలీవుడ్ లో సినిమాలు ఇక చేయను అంటూ బాలీవుడ్ సైడ్ తీస్కున్నాడు.

వర్మ మేకింగ్ స్టైల్

వర్మ మేకింగ్ స్టైల్

అక్కడా అంతే వర్మ మేకింగ్ స్టైల్ కి బాలీవుడ్ లో ఒక జోనర్ ఏర్పడింది. కానీ దాన్ని గర్వం అనాలో, మితిమీరిన ఆత్మ విశ్వాసం అనాలో కానీ పోనూ పోనూ వర్మ సినిమా అంటే ఫస్ట్ డే కలెక్షన్లతో పెట్టిన డబ్బులు తిరిగిచ్చే డైరెక్టర్ అనిపించుకునే దాకా తెచ్చుకున్నాడు వర్మ.

అనవసర వివాదాలతో

అనవసర వివాదాలతో

కొన్ని సినిమాలకోసం అనవసర వివాదాలతో సినిమాల మీద హైప్ పెంచే ప్రయోగం చేసి కొన్నాళ్ళు లాక్కొచ్చాడు తర్వాత అదీ మామూలైపోయింది జనాలకి. ఇక అప్పుడు మళ్ళీ పాత ఒట్టు ని గట్టు మీద పెట్టేసి మళ్ళీ టాలీవుడ్ లో సినిమాలు తీయటానికి వచ్చాడు.

వర్మ సినిమా తీయగలడా

వర్మ సినిమా తీయగలడా

అయితే అప్పటికే వర్మ సినిమా మీద ఉన్న ఆసక్తి ఉన్నా థియేటర్ లోకి వెళ్ళటానికి మాత్రం భయం మొదలయ్యింది ప్రేక్షకులకి... దొంగల ముఠా, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్-2, 365 డేస్ లాంటి నాసిరకం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరీక్ష పెట్టాడు వర్మ. నిజంగా వర్మ సినిమా తీయగలడా అనిపించే సినిమాలివి అంటూ వర్మ అభిమానులే పెదవి విరిచారు

నిన్ను చంపుతాం

నిన్ను చంపుతాం

చివరగా "నిన్ను చంపుతాం" అని విజయవాడ లో ఒక వర్గం బహిరంగ ప్రకటన చేసి, "దమ్ముంటే ముంబై కిరండీ నావెనక మాఫియా ఉందీ" అని వర్మ తొడగొట్టి నానా హంగామా చేసిన ‘వంగవీటి' కూడ దారుణం గా నిరాశ పరిచింది. అప్పటి వరకూ వంగవీటి మీద సినిమా నా..? అని ఆగ్రహంగా ఉన్నవాళ్ళు కూడా"ఈ సినిమాకి ఇంత అవసరమా?" అనుకొని సెకెండ్ డే నుంచే వదిలేసారు.

మళ్లీ

మళ్లీ "కంపెనీ" తెరిచాడు

ఓపెనింగ్స్ లో అయినా కొంత సంపాదించుకోవచ్చు అనుకున్న ఆ సినిమా కనీసం దానిమీద చర్చలు జరిగినన్ని రోజులు కూడా ఆడలేదు. ఐతే ఈ లోపే హైదరాబాద్‌ నుంచి దుకాణం సర్దేసి.. ముంబయిలో మళ్లీ "కంపెనీ" తెరిచాడు. ఇకోసారి "టాలీవుడ్ కి రాను" అని ఓ శపథం చేసేసి అక్కడ మళ్ళీ పని మొదలు పెట్టాడు.

పెద్ద విజయాలేమీ లేవు

పెద్ద విజయాలేమీ లేవు

పోయిన సంవత్సరం తీసిన ‘వీరప్పన్' తేలిపోయింది. దానికి ముందు ఉన్న సినిమాల్లో కూడా పెద్ద విజయాలేమీ లేవు. అందుకే ఈ సారి వచ్చే సినిమా కనీసం హిట్ అనిపించుకోవాలి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ లాంటి బడా స్టార్‌ను పెట్టి ‘సర్కార్-3' తీశాడు. ఐతే అమితాబ్ నటించినా సరే.. ‘సర్కార్-3' మీద హిందీ ప్రేక్షకుల్లో అంత నమ్మకం కుదిరినట్లు లేదు.

హైప్ క్రియేటటవ్వలేదు

హైప్ క్రియేటటవ్వలేదు

ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో హైప్ క్రియేటటవ్వలేదు. బిజినెస్ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. ఒకటికి రెండుసార్లు సినిమా వాయిదా పడి.. ఎట్టకేలకు ఈ శుక్రవారమే ‘సర్కార్-3' ప్రేక్షకుల ముందుకొస్తోంది. గతంలో వర్మ చాలా పరీక్షలు ఎదుర్కొన్నాడు.. ఇది వాటన్నింటికంటే చాలా పెద్దది. ఈ సినిమా ఫ్లాపైతే వర్మకు బాలీవుడ్లో ఇంకో అవకాశం దక్కడం కష్టమే.

రచయిత కోర్టుకెక్కటం

రచయిత కోర్టుకెక్కటం

ఈ సినిమాకి కూడా ఎప్పుడూ లేని విధంగా కథ రాయించుకొని అటు పేరూ ఇవ్వకుండా డబ్బూ ఇవ్వకుండా తనని మోసం చేసాడంటూ ఒక రచయిత కోర్టుకెక్కటం, ముంబై హైకోర్టు తక్షణమే అతనికి డబ్బులు చెల్లించటమే కాకుండా క్రెడిట్ కూడా ఇవ్వమంటూ మొట్టికాయలు వేసింది ఇది మరింత మైనస్.

వర్మ లోని ఫ్రాంక్ నెస్, నిజాయితీ కనిపించేది

వర్మ లోని ఫ్రాంక్ నెస్, నిజాయితీ కనిపించేది

ఎందుకంటే వర్మ ఎన్ని వివాదాలు తెచ్చుకున్నా, ఏం మాట్లాడినా వాటిలో ఒక దైర్యం ఉండేది, అందరికీ వ్యతిరేకంగా ట్వీట్ చేసినా అక్కడ వర్మ లోని ఫ్రాంక్ నెస్, నిజాయితీ కనిపించేది... కానీ లా "మోసగాడు" టైప్ మార్క్తో వర్మని ఎవ్వరూ ఊహించుకోలేరు. ఈ ఘటన కూడా సినిమా స్థాయిని కొంత తగ్గించింది.

న్యూక్లియర్

న్యూక్లియర్

ఆమధ్య "న్యూక్లియర్" అనే వందల కోట్ల హాలీవుడ్ ప్రాజెక్ట్ చేస్తున్నా అంటూ ప్రకటించిన వర్మ మళ్ళీ ఆ మాటకూడా ఎత్తలేదు. ఎంతసేపూ ట్వీట్లు చేయటం తప్ప మంచి సినిమా చేయటం లేదన్న అపవాదు నుంచి తప్పించుకోవటానికే తప్ప ఆ సినిమా చేయటం లేదు అనే మాట వినిపిస్తోంది..

సర్కార్ 3 కీలకం

సర్కార్ 3 కీలకం

ఇక బాలీవుడ్ మీడియాకీ, సినీ విమర్శకులకీ రామూతో ఉన్న సంబందం ఎలా ఉందో తెలిసిందే. అసలే వర్మ మీద కచ్చతో ఉండే వాళ్ళు ఏచిన్న మైనస్ దొరికినా మొత్తం సినిమా నే ఫ్లాప్ అన్న ఫీలింగ్ తేవటానికి సిద్దంగా ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వర్మ కెరీర్ కి సర్కార్ 3 కీలకం కానుంది. చూద్దాం వర్మ ఎప్పటికైనా వర్మనే మళ్ళీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలతాడు అనే అభిమానులు కోరుకోవాల్సింది.

English summary
Ramgopal varma was suffering from career crisis since few years, On Sarkar 3 eve, here's a reminder of why Ram Gopal Varma's eccentricity is still relevant
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu