»   » హర్రర్ త్రీడి చిత్రం త్వరలోనే...రామ్ గోపాల్ వర్మ

హర్రర్ త్రీడి చిత్రం త్వరలోనే...రామ్ గోపాల్ వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu

దెయ్యం, రాత్రి,భూత్, ఫూంక్, ఆవాహం అంటూ వరసగా హర్రర్ సినిమాలు తీస్తూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్న వర్మ త్వరలో త్రీడి హర్రర్ తో భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ చిత్రం పేరు 'వార్నింగ్‌'. ఈ విషయమై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ''అంతర్జాతీయ మార్కెట్‌లో త్రీడీ చిత్రాలకు ఆదరణ బాగుంది. ఓ హారర్‌ సినిమాను త్రీడీలో తీయడం మనదేశంలో ఇదే తొలిసారి కావచ్చు. కథా చర్చలు సాగుతున్నాయి. నటీనటుల ఎంపిక కూడా ఓ కొలిక్కి రావాల్సి ఉందన్నారు. అలాగే త్వరలో డిపార్ట్ మెంట్ పేరుతో పోలీస్ డిపార్టమెంట్ లోని అంతర్గత విషయాలను చూపుతూ మరో చిత్రాన్ని కూడా రూపొందించేందుకు వర్మ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఇక వర్మ రూపొందించిన ఆవాహం చిత్రం ఏప్రియల్ తొమ్మిదిన రిలీజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu