»   » రాష్ట్ర విభజనపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

రాష్ట్ర విభజనపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Gopal Varma
హైదరాబాద్ : రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు దేశంలో జరిగే విషయాలపై ట్వీట్స్ చేస్తూండే సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ విభజన విషయమై ట్వీట్ చేసారు. "తెలుగు వాళ్లను విభజించడానికి ఓ ఇటాలియన్, ఓ కన్నడిగ, ఓ తమిళియన్, ఓ బిహారీ, ఓ హిందీ చేతులు కలిపారు'' అని రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. తెలంగాణ విషయమై కాంగ్రెస్ తన వైఖరిని ప్రకటించిన విషయం విదితమే. దీనికి సంబంధించి రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్ చేశారు. "సాంకేతికపరమైన అంశాల జోలికి నేను వెళ్లడం లేదు. కానీ తెలుగు వాళ్లను విడగొట్టడానికి ఓ ఇటాలియన్, ఓ కన్నడిగ, ఓ తమిళియన్, ఓ బీహారి, ఓ హిందీ చేతులు కలపడమే బాధాకరంగా ఉంది'' అని వర్మ ట్విట్టర్‌లో రాసుకున్నారు.

ఇక గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సత్య' చిత్రం మంచి విజయం సాధించిన నేపథ్యంలో.......ఇప్పటి పరిస్థితుల ఆధారంగా 'సత్య 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్, అనైక జంటగా ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. అయితే బిజినెస్ అనుకున్న రేంజిలో కావటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం.

వర్మ మాట్లాడుతూ...1998లో వచ్చిన 'సత్య' అప్పటి పరిస్థితుల ఆధారంగా రూపొందించాం. అప్పటికి ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పరిస్థితుల ఆధారంగా ఈచిత్రం తెరకెక్కించాం. క్రైమ్ చేసే వ్యక్తి సైకాలజీ స్టడీ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ధీరూబాయ్ అంబానీ లాంటి వ్యక్తి కార్పొరేట్ సంస్థల వైపు కాకుండా, అండర్ వరల్డ్ వైపు వెళ్లి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం' అన్నారు.

శర్వానంద్ మాట్లాడుతూ....రామ్ గోపాల్ వర్మ లాంటి బ్రిలియంట్ డైరెక్టర్ తో కలిసి పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి ఆ కల తీరింది. ఈ సినిమాలో కొత్తరకం క్రైమ్ కోణం ప్రేక్షకులు చూస్తారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రాన్ని సుమంత్ మెట్టు, చంద్రశేఖర్ ...ముమ్మత్ మీడియా అండ్ ఎంటర్టెన్మెంట్ ప్రై.లి, జెడ్ 3 పిక్చర్స్ బేనర్‌లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అమర్ మోహిలె, సినిమాటోగ్రఫీ : వికాస్ సారాఫ్, దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ.

English summary
Ram Gopal Varma tweet: Not getting into technicalities I find it ironical tht an italian a kannadiga a tamilian a bihari and a hindi joined hands to divide telugus
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu