»   » బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ లీక్ అయ్యింది అంటూ.... చూస్తే అవాక్కవుతారు (వీడియో)

బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ లీక్ అయ్యింది అంటూ.... చూస్తే అవాక్కవుతారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతీ భారీ సినిమా కి లీకేజ్, పైరసీ ల గొడవ ఎక్కువైపోయింది. అటు సినిమా రిలీజ్ కాకుండానే నెట్ లో కనిపిస్తున్నాయ్. ఇప్పుడు కూడా బాహుబలి2 నుంచి కొన్ని సీన్స్ లీక్ అయ్యాయనే న్యూస్ రెండు రోజుల నుంచి బాగానే చక్కర్లు కొడుతోంది. ఒకట్రెండు క్లిప్పింగ్స్ వాట్సాప్ లో కూడా షేర్ అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంటర్వెల్ సీన్ లీక్ అయిందనే న్యూస్ వైరల్ అవుతోంది.

సబ్ టైటిల్స్ తో సహా

సబ్ టైటిల్స్ తో సహా

నిన్నటికి నిన్న బాహుబలి క్లిప్ వాట్స్ ప్ లో తెగ తిరిగేసింది. తెలుగు భాష కాకపోయినా, సబ్ టైటిల్స్ తో సహా క్లారిటీ క్లిప్ అయింది. సినిమా ఎక్కడా ప్రదర్శించలేదని నిర్మాతలు అంటున్నారు. కానీ క్లిప్ చూస్తే థియేటర్ లో తీసినట్లే వుంది. ఈ క్లిప్ లో రానా (భల్లాల దేవ) రాజుగా, ప్రభాస్ (బాహుబలి) సేనాధిపతిగా కనిపించారు ఈ క్లిప్ లో.

ఆ ఒక్క ముక్కని కూడా

ఆ ఒక్క ముక్కని కూడా

అలాగే అనుష్క ఓ సీన్ లో రానా వంక చిరాగ్గా చూడడం కనిపించింది. అలాగే అనుష్క ఇప్పటి వరకు వచ్చిన స్టిల్స్ లో మాదిరిగా కాకుండా కాస్త లావుగా, బొద్దుగానే కనిపించడం విశేషం. ఆ చికాగ్గా పెట్టిన ఫేస్ మరింత చికాగ్గా వుంది కూడా. ఆ ఒక్క ముక్కని కూడా చాలా ఇంట్రస్ట్ గా చూసి ఆసక్తి గా షేర్ చేసుకున్నారు.

ముఖేష్ యాడ్

ముఖేష్ యాడ్

ఈ సంగతి అలా వుంచితే ఇప్పుడు ఇంకో క్లిప్ వచ్చిందంటూ సందడి మొదలయ్యింది. బాహుబలి టైం లో కూడా ఫస్ట్ సీన్ అంటూ "ముఖేష్ యాడ్" ని చూపించారు. ఇప్పుడు కూడా బాహుబలి ఇంటర్వెల్ సీన్ లీక్ అయ్యిందీ అంటూ వచ్చిన ఒక వీడియో నెట్ లో బాగానే తిరుగుతోంది.

బాహుబలి2 లీక్డ్ ఇంటర్వెల్ సీన్

బాహుబలి2 లీక్డ్ ఇంటర్వెల్ సీన్

ఇంటర్వెల్ సీన్ లీక్ కావడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు రమ్యకృష్ణ సింహాసనంపై కూర్చున్న ఓ ఇమేజ్ కనిపించే వీడియోను.. బాహుబలి2 లీక్డ్ ఇంటర్వెల్ సీన్ అంటూ నెట్ లో తెగ హల్ చల్ చేసేస్తోంది. టైటిల్ చూసి క్లిక్ చేస్తే అసలు విషయం అర్ధమవుతుంది. ఇది ఓ ఏడాది క్రితం రమ్యకృష్ణ చేసిన ఓ యాడ్ అంతే. అయితే బాహుబలికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని శివగామి పాత్ర గెటప్ తో ఆ యాడ్ ను రూపొందించారు. అప్పట్లో ఈ ప్రకటన బాగానే క్లిక్ అయింది.

విడుదల కాకుండానే

విడుదల కాకుండానే

ఇప్పుడు బాహుబలి2 పేరుతో విపరీతంగా సెర్చింగ్ జరుగుతుండడంతో.. అదే వీడియోను ఎవరో పేరు మార్చి ఫన్నీగా అప్ లోడ్ చేశారు. అక్కడి నుంచి ఇది విపరీతంగా షేర్ అయిపోతూ.. జనాలను తెగ నవ్వించేస్తోంది. ఈ సంగతి అలా వుంచితే, సినిమా విడుదల కాకుండానే క్లిప్ వాట్స్ ప్ లోకి వస్తే,ఇక 1500 థియేటర్లలో విడుదలవుతోంది.

సోషల్ మీడియాలో, వాట్సాప్ లో

ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్ ఫోన్ లే. మరి ఇక ఈ రాత్రి నుంచి ఎన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో, వాట్సాప్ లో చలామణీ అవుతాయో చూడాలి. చిన్న చిన్న క్లిప్స్ తో సమస్య లేదు. పైగా అవి సినిమా ప్రచారానికి మరింత పనికి వస్తాయి. కానీ సినిమానే సర్క్యులేట్ అయిపోతేనే సమస్య.

English summary
ramya krishna's pesticide Add as Sivagami look is Going viral on Social media as Leaked Video From bahubali 2
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu