»   » కృష్ణ వంశీతో విడిపోయారా? రమ్య కృష్ణ స్పందన ఇదీ....

కృష్ణ వంశీతో విడిపోయారా? రమ్య కృష్ణ స్పందన ఇదీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణను అంతా ఇపుడు శివగామి అనే పిలుస్తున్నారు. ఈ సినిమాలో రమ్య కృష్ణ పోషించిన శివగామి పాత్రకు ఎంత పేరొచ్చిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

కొన్ని రోజులుగా బాహుబలి సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలో ఇస్తూ బిజీగా గడుపుతున్న రమ్య కృష్ణకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ జీవితానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

కృష్ణ వంశీతో విడిపోయారా?

కృష్ణ వంశీతో విడిపోయారా?

ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీని ప్రేమ వివాహం చేసుకున్న రమ్యకృష్ణ కొంతకాలంగా ఆయనకు దూరంగా, విడిగా తన కొడుకుతో కలిసి చెన్నైలో ఉంటున్నారు. దీంతో ఇద్దరూ విడిపోయారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రమ్య కృష్ణ స్పందిస్తూ...

రమ్య కృష్ణ స్పందిస్తూ...

మేం విడిపోలేదు. మాపై వ‌చ్చే వార్త‌ల‌న్నీ అవాస్త‌వాలే అని రమ్యకృష్ణ తేల్చేసారు. షూటింగుల్లో బిజీ అవ్వ‌డం వ‌ల్ల ఒక‌రికొక‌రం దూరంగా ఉంటున్నాం. నేను చెన్న‌య్‌లో షూటింగుల్లో ఉంటున్నా. ఆయ‌నేమో హైద‌రాబాద్‌ షూటింగుల్లో ఉంటున్నారు. దూరంగా ఉన్నా మా మ‌ధ్య ప్రేమ త‌గ్గ‌దు. అర్థం చేసుకునే భర్త రావడం నిజంగా నా అదృష్టం అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.

కలిసి టూర్స్ వేస్తుంటాం

కలిసి టూర్స్ వేస్తుంటాం

ఇద్దరికీ షూటింగులు లేనపుడు, ఖాళీ సమయం దొరికినపుడు తన కుమారుడితో కలిసి టూర్స్ వెలుతుంటామని, ఫోన్ ద్వారా ఎప్పుడూ టచ్ లోనే ఉంటామని రమ్యకృష్ణ తెలిపారు.

రాజకీయాల్లోకి వస్తారా?

రాజకీయాల్లోకి వస్తారా?

ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది. తన వల్ల ప్రజలకు మంచి జరగాలని రాసి పెట్టి ఉంటే అదే జరగవచ్చని.... అలాంటి అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయడానికి తాను సిద్ధమే అని రమ్యకృష్ణ తెలిపారు.

English summary
“Acting is my profession and I want to continue with it as long as possible. So, I stay in Chennai. My husband is a director, and he stays in Hyderabad because his work lies there. We both have mutual understanding, and we are respecting each other works. We are constantly staying in touch and we are constantly meeting too.” said Ramya Krishna denying all the rumours.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu