»   » ఫొటోలు విత్ ఇంటర్వూ‌: సెట్లో రమ్యకృష్ణ పుట్టినరోజు వేడుక

ఫొటోలు విత్ ఇంటర్వూ‌: సెట్లో రమ్యకృష్ణ పుట్టినరోజు వేడుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటి, మాజీ హీరోయిన్ రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, నటి అనుష్క ఆమెకు ఫేస్‌బుక్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.

అదేవిధంగా 'బాహుబలి' చిత్ర బృందం సైతం 'శివగామి'కి పుట్టినరోజు శుభాకాంక్షలంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తాను నటిస్తున్న తమిళ్‌ సీరియల్‌ 'వంశం' నటీనటులతో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నట్లు రమ్యకృష్ణ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


దీంతోపాటు వారితో దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ... శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.రమ్యకృష్ణ ...నిర్మాతగా మారారు. ఆమె మాట్లాడుతూ...నాకు నేను నిర్మాతగా మారి సీరియళ్లు చేద్దామనిపించింది. 'కలశం', 'అలా మొదలైంది', 'వంశం' అలా నిర్మించినవే. సినిమాలూ, సీరియళ్లలో ఏకాస్త విరామం దొరికినా మా బాబు రిత్విక్‌తోనే గడుపుతాను. వాడిని బయటకు తీసుకెళుతుంటాను. స్నేహితుల్ని కలుస్తాను. నేను సాయిబాబాను ఎక్కువగా నమ్ముతాను కానీ అంతకన్నా ఏదో శక్తి మనల్ని నడిపిస్తోందని అనుకుంటా. వీలైనంత వరకూ సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తా అన్నారు.


పుట్టిన రోజు ఫొటోలు...విత్ ఇంటర్వూ


పదమూడేళ్లకే

పదమూడేళ్లకే

మాది నెల్లూరు. కానీ చెన్నైలో పుట్టిపెరిగా. భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకున్నా. పదమూడేళ్లకే అరంగేట్రాలూ, ప్రదర్శనలూ అయ్యాయి!తొలి చిత్రం...

తొలి చిత్రం...

నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే ఓ మలయాళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. మమ్ముట్టీ, మోహన్‌లాల్‌ ఇద్దరూ ఉన్న చిత్రమది! తొందరగానే పూర్త్తెనా ఆలస్యంగా విడుదలైంది.


ఆడలేదు

ఆడలేదు

ఈలోపు నాకు తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. విడుదలైన తేదీ ప్రకారం చూసుకుంటే అదే నా తొలిచిత్రం. చక్కటి పాత్ర. మంచి పాటలూ... కానీ చిత్రం ఆశించినంతగా ఆడలేదు.


విలవిల్లాడిపోయా

విలవిల్లాడిపోయా

తెలుగులో 'భలే మిత్రులు' చేశాను. కె.విశ్వనాథ్‌ 'సూత్రధారులు'లో అవకాశం వచ్చింది! ఇప్పటికీ ఆ సినిమాలో నేను చేసిన పాత్ర చూసి కన్నీళ్లతో లేఖలు రాసే వాళ్లున్నారు. అయినా సినిమా వాణిజ్యపరంగా హిట్టు కాలేదు. ఇంకేముంది.. 'రమ్యకృష్ణ ఉంటే ఆ సినిమాలు ఆడవు' అన్నారు. ఆ మాటలు విన్నప్పుడు విలవిల్లాడిపోయేదాన్ని.


ఆ సినిమాలతో

ఆ సినిమాలతో

కె.రాఘవేంద్రరావుగారి 'అల్లుడు గారు'తో ఓ అవకాశం దక్కింది. అందులో నాది మూగ పాత్రే... కానీ పరిశ్రమ మొత్తం నా గురించే మాట్లాడేలా చేసింది. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.నాకలాంటివి నచ్చవు...'అల్లరిమొగుడు' నేనెంత గ్లామరస్‌గా నటించగలనో చాటింది.


తటపాయింపు అయినా

తటపాయింపు అయినా

మొదట్లో ఏదో తటపటాయింపు. పాటల్లో ఇంత అందంగా నటించడమెలాగనే సంశయం. కానీ ప్రతిదీ నేర్చుకున్నా, నన్ను నేను మార్చుకున్నా. ఆ తర్వాత 'అల్లరిప్రియుడు' అటు నటనా, ఇటు గ్లామర్‌కీ ప్రాధాన్యం ఇచ్చింది.


అదే గుర్తింపు

అదే గుర్తింపు

'అల్లుడా మజాకా', 'హలో బ్రదర్‌', 'ఆయనకిద్దరు'.... ఆ పదేళ్లలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో నేనే ఉన్నాను! 'రమ్యకృష్ణలాగ ఉంటదా..' అనే ఒక్క పాటు చాలు... నాకు వచ్చిన గుర్తింపు ఏ పాటిదో చెప్పడానికి! చిరంజీవితో 'ముగ్గురు మొనగాళ్లు'లో కొంత వ్యవధి తర్వాత మళ్లీ అమాయకంగా నటించాను


ధైర్యం వచ్చింది

ధైర్యం వచ్చింది

కోడిరామకృష్ణగారి 'అమ్మోరు' అవకాశం వచ్చినప్పుడు చాలా మథనపడ్డాను. అంతవరకూ గ్లామర్‌గా చేసిన నన్ను ప్రేక్షకులు దేవత పాత్రలో చూస్తారా... అని ఎంతగా భయపడ్డానో! నన్ను నేను ఆ వేషంలో చూసుకున్నాక నాకే తెలియని ధైర్యం వచ్చింది.


కాళ్ళపై పడ్డారు

కాళ్ళపై పడ్డారు

'అమ్మోరు' విడుదలయ్యాక ఓ షూటింగ్‌లో ఉన్నాను. విరామంలో ఇద్దరు ముగ్గురు స్త్రీలొచ్చి 'అమ్మా.. తల్లీ' అంటూ తటాలున నా కాళ్లపై పడ్డారు. ఒక్కసారిగా భయంతో కాళ్లు వెనక్కి తీసుకున్నాను. ఏదోలా అనిపించింది. వ్యక్తిగతంగా నాకు ఇలాంటివి నచ్చవు... కానీ ఆ సినిమా చూపిన ప్రభావం అదని నాకు నేను సర్ది చెప్పుకున్నా.


రాజమౌళి గొప్పతనం

రాజమౌళి గొప్పతనం

ఓవైపు రాజసం, మరోవైపు అమ్మదనం.. ఓ వైపు కారుణ్యం, మరోవైపు కార్యదక్షత.. ఇదీ శివగామి పాత్ర. మొదట్లో నాకు ఈ పాత్ర గురించేమీ చెప్పలేదు. 'బాహుబలి' కోసం నలభై రోజుల కాల్షీట్లు అడిగారు. అప్పటికి సీరియళ్లతో చాలా బిజీగా ఉన్న నేను కుదరదని చెప్పాను. కానీ రాజమౌళి వచ్చి కథ వివరించాక కాదనడం కాదు కదా... అసలు వదులుకోకూడదనే నిర్ణయానికొచ్చా. ఇదిగో 'నరసింహ'లో నీలాంబరి పాత్రకు మించి ప్రశంసలు వస్తున్నాయిప్పుడు! ఇదంతా రాజమౌళి గొప్పతనమే.సెకండ్ఇన్నింగ్స్ గురించి చెప్తూ....ఇంతవరకూ ఎన్ని సినిమాలు చేశాను... మ్‌.. సరిగ్గా గుర్తులేదు! రెండొందలు చేసుంటా. 'కంటే కూతుర్నే కను' సినిమాకు నంది అవార్డు అందుకున్నా. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రల్లో పెద్దగా కష్టపడి హోంవర్క్‌ చేసినవేవీ లేవు. అన్నీ సెట్స్‌కి వెళ్లాక అక్కడి పరిస్థితుల్ని బట్టే నటించా. నిజానికి హోంవర్క్‌ చేసేంత సవాలైన పాత్ర కోసం ఎదురుచూస్తూనే ఉన్నా. త్వరలో 'సోగ్గాడే చిన్ని నాయన'లో చాలా కొత్తగా కనిపించబోతున్నా. ఇక చాలామంది 'మీ రెండో ఇన్నింగ్స్‌ ఎలా ఉందీ..' అని అడుగుతున్నారు. రెండో ఇన్నింగ్సా.. ఇంకా మొదటి ఇన్నింగ్సే పూర్తికాకపోతే అన్నారు రమ్యకృష్ణ.

English summary
Ramya Krishna Celebrated her birthday at Vamsam sets.
Please Wait while comments are loading...