మొగుడి కోసం రమ్య కృష్ణ ప్రత్యేక శ్రద్ధ

కృష్ణవంశీ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్, హాట్ అండ్ సెక్సీ తార తాప్సి జంటగా 'మొగుడు" సినిమా రూపొందుతోంది. అలకలు, అల్లర్లు, అందాలు, బంధాలు, భావాలు, భావోద్వేగాలు, సరసాలు, సంప్రదాయాలు కళ్లకు కట్టేలా తీయడంలో తనదైన ముద్ర వేసుకున్న ఆయన మరోసారి తన మార్కు సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.
ఇదిలా ఉంటే తన మొగుడి 'మొగుడు" సినిమాను భారీగా మార్గెటింగ్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టిందట రమ్య కృష్ణ. మొగుడు సినిమాను భారీ ప్రింట్లతో విడుదల చేయడానికి ఆయా ఏరియాల డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లతో ఇప్పటి నుంచే సంప్రదింపులు జరుపుతోంది. మరి మొగుడు కోసం రమ్యకృష్ణ పడుతున్న ఆరాటం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications