»   »  సీతాదేవి పాత్రలో రమ్యకృష్ణ

సీతాదేవి పాత్రలో రమ్యకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ramya Krishna
రమ్యకృష్ణ సీతగా, ఈటీవీ భాగవతం ఫేమ్ సునీల్ శర్మ శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం షూటింగ్ రామకృష్ణా స్టూడియోలో సోమవారం ప్రారంభమైంది. నాగబాబు ముఖ్య పాత్ర పోషించనున్న ఈ చిత్రాన్ని వినాయక ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కె. చంద్రశేఖర్ రూపొందించనున్నారు. సోమవారంనాడు నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఓ మాంత్రికుడు ఇద్దరు పిల్లలను ఎత్తుకుపోయి బంధిస్తాడు.

రావణాసురుని చెర నుంచి సీతమ్మవారిని విడిపించి రాముని చెంతకు చేర్చినట్లు... హనుమంతుడు ఆ పిల్లలను తల్లిదండ్రుల వద్దకు ఎలా సుఖంగా చేర్చాడన్నది చిత్ర కథ అన్నారు. తాను పదేళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాననీ, ఇదే తనకు తొలి చిత్రమని అన్నారు. రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చాననీ, ఎక్కడా రాజీపడకుండా సినిమా తీస్తున్నామనీ సహ నిర్మాత శేఖర్ కల్లూరి చెప్పారు.

చిత్ర ఎడిటర్, నిర్మాతలలో ఒకరైన సాయి రమేష్ మాట్లాడుతూ... నాకు గ్రాఫిక్స్ అంటే ఇష్టం. దేవుళ్లు, దేవి, దేవీ పుత్రుడు తరహా గ్రాఫిక్స్ వుంటాయని, సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిస్తున్నామనీ అన్నారు. ఇద్దరు పిల్లల తండ్రిగా నాగబాబు నటిస్తున్నారన్నారు. చక్కని స్క్రిప్ట్ చిత్రంగా సునీల్ శర్మ అభివర్ణించారు. తనకు ఇష్టమైన హనుమంతుని పాత్రలో కనిపిస్తున్నట్లు భగవాన్ చెప్పారు.

శేఖర్, ఎం.ఎస్. నారాయణ, రామిరెడ్డి, కాస్ట్యూమ్స్ కృష్ణ, అపూర్వ, సాంబశివరావు, సురేంద్ర, మాస్టర్ చైతన్య, మాస్టర్ సుమంత్ రాజ్, బేబీ యామిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: దాసరి బ్రహ్మం, సంగీతం: వందేమాతరం శ్రీనివాసరావు

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X