»   »  ప్రతి హీరోయిన్ ఏదో ఒకరోజు ఏడవాల్సిన పరిస్థితులు...

ప్రతి హీరోయిన్ ఏదో ఒకరోజు ఏడవాల్సిన పరిస్థితులు...

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ప్రతి హీరోయిన్ తన జీవితకాలంలో ఏదో ఒకరోజు ఏడవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. నా గురించి రూమర్స్ వచ్చినప్పుడు ఇలాగే బాధపడ్డాను. నటి జీవితం ప్రకాశవంతంగా ఉంటుందనుకోవడం నిజం కాదు అంటోంది కన్నడ హీరోయిన్ రమ్య. నటి జియాఖాన్‌ ఆత్మహత్యపై స్పందించింది.

అలాగే ఓటమి ఎదురైనప్పుడు సహచరుల హేళనతో మనసు కకావికలమవుతుంది. ఆ మాత్రం దానికి ప్రాణాలు తీసుకోవడం సమంజసం కాదని , హీరోయిన్ కు ఉన్న ప్రతిభ, అందం, నటన ఆమెను ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయని చెప్పలేం. హిట్ లే ఆమె జీవితాన్ని నిర్ణయిస్తాయని చెబుతోంది రమ్య.

రమ్య మాట్లాడుతూ....హీరోయిన్ గా పరిశ్రమలో కొనసాగడం చాలాకష్టతరం. బయట ఎంత ఉత్సాహంగా, ఆనందంగా కనిపించినా లోపల ఎన్నో కష్టాలు ఉన్నాయన్నది నిజం. జియాఖాన్‌ బలవన్మరణమే ఇందుకు తార్కాణం. ఆమెకు మంచి ప్రతిభ, అందం ఉన్నా ఏదో వెలితి. అదృష్టం, హిట్లు లేకపోతే జీవితం తారుమారవుతుంది.

English summary

 Actress Ramya said, "The industry is a tough place to survive in.. All of us go through really low times..i can understand why some people become so fragile.. I wish we could be stronger..sad really sad..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu