ఉపేంద్రతో మళ్లీ చేతులు కలిపిన హీరోయిన్
కడన్న సూపర్ స్టార్ ఉపేంద్ర, హీరోయిన్ రమ్య(దివ్య స్పందన) కలిసి ఇది వరకు నటించి 'భీమాస్ బ్యాంగ్ బ్యాంగ్ కిడ్స్" సినిమా ఫెల్యూర్ అయింది. అయినా సరే ఉపేంద్రతో మరో సినిమా చేయడానికి చేతులు కలిపింది హాట్ బేబీ రమ్య. ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పేరు 'గాంధీ నగరద మహాత్మే". గతంలో మళయాలంలో వచ్చిన ఉదయనాను తారన్ సినిమాకు రీమేక్‌గా దీన్ని రూపొందిస్తున్నారు.
పేరుకు రీమేక్ సినిమా అయినా మళయాలంలో మాదిరి ఇందులో సీన్ టు సీన్ తెరకెక్కించడంలేదు. ఉపేంద్ర తన క్రియేటివిటీకి పదును పెట్టి తనదైన రీతిలో సినిమాను తెరకెక్కిస్తున్నారని చెబుతోంది రమ్య. ఉపేంద్ర పుట్టిన రోజైన సెప్టెంబర్ 18న సినిమా ఫ్లోర్ మీదకు వస్తుందని, అప్పటి నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటుందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











