For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హీరోయిన్ తో చర్చలు విఫలం...వివాదం మొదటికే

  By Srikanya
  |

  బెంగళూరు : 'నీర్‌దోసె' సినిమా చిత్రీకరణ వివాదాన్ని పరిష్కరించేందుకు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈనెల 25న మరోసారి సమావేశం కావాలని మండలి అధ్యక్షుడు హెచ్‌.డి.గంగరాజు తీర్మానించారు. చిత్రీకరణ అర్ధంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రమ్య లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నిక కావడంతో చిత్రీకరణలో పాల్గొనడం సాధ్యంకాలేదు. ఈ విషయమే వివాదంగా మారింది. సినిమా కోసం ఇప్పటికే రూ. నాలుగు కోట్ల మేర వ్యయం చేశానని నిర్మాత సుధీంద్ర చెబుతున్నారు. షూటింగ్‌ ఆలస్యమైయ్యేకొద్దీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు.

  ఇదే విషయాన్ని మండలికి ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో బుధవారం వాణిజ్య మండలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో సమావేశానికి హాజరుకాలేనని రమ్య అసహాయతను వ్యక్తం చేశారు. వచ్చే జూన్‌లో పొల్గొనేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రమ్య ఫోన్‌ ద్వారా తెలిపినట్లు సమాచారం. అన్ని నెలల పాటు వేచి ఉండడం అసాధ్యమని ఈనెల, వచ్చేనెలలో పది రోజుల చొప్పున కాల్షీట్‌ ఇస్తే చాలని నిర్మాత కోరినా రమ్య నిరాకరించారని తెలిసింది. దీంతో 25న సమావేశాన్ని నిర్వహించాలని తీర్మానించారు. ఆనాటి సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని రమ్యను కోరినట్లు మండలి అధ్యక్షుడు గంగరాజు తెలిపారు.

  Ramya Should Bear The Cost Of Neer Dose: Jaggesh

  రముఖ కన్నడ నటి రమ్య స్పందన ఇటీవల ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సందట్లో పడి ఈ భామ సినిమాలను నిర్లక్ష్యం చేస్తోందట. దీనికి సంబంధించి 'నీర్ దోసె' హీరో జగ్గేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగ్గేష్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. జగ్గేష్ బీజేపీలో ఉన్నారు. రమ్య కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. మాండ్యా నియోజకవర్గంలో ఇటీవల లోక్‌సభ బైపోల్‌లో గెలిచి ఎంపీగా పార్లమెంట్‌లో ప్రవేశించారు. జగ్గేష్ మాట్లాడుతూ "ఇది అనైతికం. సినిమా పూర్తి కావడానికి ఆమె సహకరించకపోవడం దారుణం. ఆమె పార్లమెంట్ సభ్యురాలు అయితే కావచ్చు.

  కానీ అంతకు ముందు ఆమె నటి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇవాళ ఆమె ఈ స్థాయిలో ఉండటానికి కారణం సినిమానే అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే ఎలా? 'నీర్ దోసె' దాదాపుగా 60 శాతం పూర్తయింది. నిర్మాత దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంత మొత్తాన్ని ఇప్పుడు ఎవరిస్తారు? ఆ నష్టాన్ని రమ్య భరిస్తుందా?'' అని ప్రశ్నించారు. రమ్య ఈ విషయం గురించి ఇప్పటిదాకా ఏమీ స్పందించలేదు. కానీ ఆమె సన్నిహితుల అభిప్రాయం మేరకు రమ్య రాబోయే ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టిందట. ఇప్పట్లో సినిమాలకు కాల్షీట్ కేటాయించే పరిస్థితుల్లో లేదట. కానీ జగ్గేష్ ఏ విషయాన్నీ నిగ్గు తేల్చందే వదిలిపెట్టేలా లేరు. ఈ సమస్యను రమ్య ఎలా అధిగమిస్తుందో వేచిచూడాల్సిందే.

  English summary
  Ramya, who is now a member of the Lok Sabha representing Mandya, is in the news again, but for all the wrong reasons. A controversy is brewing because of her reported inability to complete film projects that she had signed up before contesting the Lok Sabha byelection. Upset with the delay, actor and Bharatiya Janata Party MLC Jaggesh, who is playing the lead role in Neer Dose, has criticised Ms. Ramya’s alleged “non-cooperation”, on microblogging site Twitter and asked her to bear the cost of the film to bail out the producer.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more