»   » రానా తెలివైనోడే... ముందే లాయిర్ ని సంప్రదించాడట

రానా తెలివైనోడే... ముందే లాయిర్ ని సంప్రదించాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రమ్మి, తంబోల వంటి జూదాలకు అనుమతులు పొందుతున్న వెబ్‌సైట్‌లు, వాటిని నిత్యం పెంపొందిస్తునే ఉన్నాయి. దీనికి తో డు ఇప్పుడు మట్కా, సట్టా జూదాలు ఇంటర్నెట్‌లో జోరందుకుంటున్నాయి. ముఖ్యంగా టెక్నికల్ నాలెడ్జ్ ని వినియోగించుకుని ఈ జూదానికి బానిసలవుతోంది ఎక్కువశాతం యువతనే చెప్పుకోవాలి. అయితే ఇందుకు సిని ప్రముఖులు సైతం తమ వంతు సాయింగా, యాడ్స్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు.

ఇదే విషయమై రీసెంట్ గా బాహుబలి బళ్లారిదేవ...యంగ్ హీరో రానా, సీనియర్‌ నటుడు ప్రకాష్ రాజ్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ఓ ఆన్ లైన్ గేమ్ కు సంబంధించిన యాడ్ లో కనిపించినందుకు ఈ ఇద్దరిపై పోలీసు కేసు నమోదైంది.

రానా, ప్రకాష్ రాజ్ తో కలిసి 'జంగిల్ రమ్మీ' అనే ఆన్‌లైన్‌ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ వాణిజ్య ప్రకటన ద్వారా ఈ ఇద్దరూ గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహిస్తున్నారని కోయంబత్తూర్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కేసు వేశాడు.

rana

రానా, ప్రకాశ్‌ రాజ్‌ ఈ యాడ్‌లో నటించడంపై సోషల్ మీడియాలో గతంలోనూ విమర్శలు వచ్చాయి. నైతికతలేని గ్యాంబ్లింగ్‌గా దీనిపై విమర్శలు సైతం వచ్చాయి. అయితే, ఈ యాడ్‌ విషయంలో రానా ముందే జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

తన లాయర్‌ సలహా తీసుకున్న తర్వాత ఆయన ఈ వాణిజ్య ప్రకటనలో నటించినట్టు చెప్తున్నారు. రమ్మీ అంటే గ్యాంబ్లింగ్‌ కాదని, అది నైపుణ్యానికి సంబంధించిన ఆట అని, దీని కోసం ప్రచారం చేయడం చట్టవ్యతిరేకం కాదని రానాకు లాయర్‌ చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి రానా, ప్రకాశ్‌ రాజ్‌లకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త వేసిన కేసు నిలబడదని వినిపిస్తోంది.

గతంలోనూ మద్రాస్ హైకోర్టు ఈ విషమయై తీర్పు ఇచ్చింది. రమ్మీ అనేది ఓ స్కిల్ అని, అది గాంబ్లింగ్ కాదని తేల్చి చెప్పింది. అలాగే పోలీస్ లను రమ్మీ ఆడుతున్న వారిని డిస్ట్రబ్ చేయవద్దని కోరింది.

English summary
Case filed on Rana and Prakash Raj over promoting Rummy. But this 13-card games like Rummy is a game of skill, and not gambling or game of chance, the Madras High Court has held, adding that police should not disturb club members and guests playing the game.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu