For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఎన్టీఆర్ ని ప్రేరణగా తీసుకుని పాత్ర చేసా : దగ్గుపాటి రానా

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'దానవీరశూరకర్ణ' నా దృష్టిలో తెలుగు సినిమాకు ఓ బైబిల్. మన సంస్కృతి మొత్తాన్నీ ఓ ప్యాకేజ్‌గా చేసి ఎన్టీఆర్ మనకందించిన సినిమా అది. అందులో ఎన్టీఆర్ మూడు పాత్రలను అనితరసాధ్యంగా పోషించారు. ఆయన్నే ప్రేరణగా తీసుకొని 'కృష్ణంవందే జగద్గురుమ్'లో నటించాను. బీటెక్ బాబు పాత్ర పోషణలో డీవీఎస్ కర్ణ ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా దశావతారాలకు సంబంధించిన ఓ భ్యాలే ఉంది. అందులో పలు అవతారాల్లో కనిపిస్తాను. నిజంగా నా జనరేషన్‌లో ఇలాంటి పాత్ర నాకు మాత్రమే దక్కిందేమో అంటున్నారు దగ్గుపాటి రానా.

  'కృష్ణంవందే జగద్గురుమ్'లో దగ్గుపాటి రానా ఏకంగా నరసింహుడు, ఘటోత్కచుడు, అభిమన్యుడు, తోటరాముడు వంటి పలు పాత్రల్లో నటించేశారు. బీటెక్‌బాబు పాత్రతో దర్శకుడు క్రిష్ తన దగ్గరకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు రానా. జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) దర్శకత్వంలో రానా నటించిన 'కృష్ణంవందే జగద్గురుమ్' చిత్రాన్ని నవంబర్ ప్రథమార్ధంలో విడుదల చేయడానికి నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సన్నాహాలు చేస్తున్నారు.

  తన పాత్ర గురించి చెపుతూ... ఇందులో నా పాత్ర సురభి నాటక కళాకారుని పాత్ర. ఈ పాత్ర పోషణ కోసం వారి జీవన విధానాలను గమనించాలనుకున్నాను. రవీంద్రభారతికి వెళ్లి పలు నాటకాలు చూశాను. 'కురుక్షేత్రం' నాటకం నన్నెంతో కదిలించింది. ఎందుకంటే... స్టేజ్‌పై 40మంది పైగా నటిస్తుంటే ఆరుగురు మాత్రమే ఆడియన్స్ కనిపించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కథలో హీరో ఫ్రస్టేషన్ కూడా అదే. ఓ సన్నివేశంలో 'మన జీవితాలు మేకప్ కంపు కొడుతున్నాయ్' అంటాడు. నిద్రలో వచ్చేది 'కల'... నిద్రలేపేది 'కళ'అనే డైలాగుకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.

  'బళ్లారి బావ...' పాటలో బాబాయ్ వెంకటేష్ కనిపించడం ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. పాటలో 'రారా బొబ్బిలి రాజా...' అని లిరిక్ ఉంటుంది. అందుకే బాబాయ్ చేస్తే కరెక్ట్ అని అడగ్గానే ఒప్పుకున్నారు. ఇటీవలే సినిమా చూసి 'మంచి చాన్స్ కొట్టేశావ్‌రా...' అని అభినందించారాయన. అలాగే...నయనతార లాంటి స్టార్‌తో పనిచేయడం గర్వంగా ఫీలవుతున్నాను. గత విజయదశమికి క్రిష్ నాకీ కథ చెప్పారు. సరిగ్గా ఈ విజయదశమికి సినిమా పూర్తి అయ్యింది. తలచుకుంటే ఇదంతా ఓ కలలా ఉంది. ముందు ఒక ఐడియాగా క్రిష్ నాకీ కథ చెప్పారు. ఆ ఐడియా ఇంతటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని ఊహించలేదు. ఇది పూర్తిస్థాయి యాక్షన్ అడ్వంచరస్ సినిమా అయినా... క్రిష్ తరహా మానవీయ విలువలకు కొదవ ఉండదు అని ఆనందంగా చెప్పుకొచ్చారు రానా.

  English summary
  "Krishnam Vande Jagadgurum's an action adventure. Rana is a theatre artist, while Nayan is a docu-filmmaker. Though their approach towards life is different, they have to travel together at one point of time," says Krish, who is directing the movie.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more