For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డబ్బులడిగితే మానాన్న తిండి పెట్టడేమో అని భయం వేసింది: రానా

  |

  ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ అనే అంశం చాలా కీలకంగా మారింది. హీరో తీసుకునే రెమ్యూనరేషన్ బట్టే సినిమా బడ్జెట్ ఆధార పడి ఉంటుంది. హీరో స్థాయిని బట్టి, అతని సినిమాలకు అభిమానులు, ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను బట్టి సినిమా ఏ స్కేలులో తీయాలనే లెక్కులు వేస్తుంటారు. బాహుబలి సినిమా తర్వాత రానాకు ఎంత పేరొచ్చిందో... తను చేసిన భల్లాలదేవ పాత్రకు ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత రానా రెమ్యూనరేషన్ అమాంతం పెరిగిందనే ప్రచారం జరిగింది.

  అలాంటి దారిలో వెళ్లాలను కోవడం లేదు

  అలాంటి దారిలో వెళ్లాలను కోవడం లేదు

  ‘కొత్త కొత్త సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేయాలంటే నా దగ్గర పది కథలున్నాయి. కానీ నేను అలాంటి దారిలో వెళ్లాలను కోవడం లేదు..... సినిమా కథ, తన పాత్ర గురించే తప్ప రెమ్యూనరేషన్ గురించి అసలు పట్టించుకోవడం లేదు.

  నటుడిగా నేను సపోర్టివ్వాలి

  నటుడిగా నేను సపోర్టివ్వాలి

  బాహుబలి.. ఘాజీ లాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. ‘ఘాజీ' తీయడం పెద్ద రిస్క్‌. కొత్త సినిమా చూపించాలనే తపనతో నిర్మాత ముందుకొచ్చినప్పుడు నటుడిగా నేను సపోర్టివ్వాలి. అందుకే పారితోషికం గురించి మాట్లాడలేదు. ఆ మాటకొస్తే నేను చేసే ప్రతి సినిమాకూ రిలీజ్ తర్వాత లాభాలొస్తే వాటా తీసుకుంటాను.

  రెమ్యూనరేషన్ గురించే మాట్లాడను

  రెమ్యూనరేషన్ గురించే మాట్లాడను

  నేనసలు సినిమా మొదలయ్యే ముందు రెమ్యూనరేషన్ గురించే మాట్లాడను. కొత్త తరహా సినిమాలు తీయడం రిస్క్‌. నిర్మాత ఆ రిస్క్‌ తీసుకోవడానికి రెడీ అయినప్పుడు నేను ఆర్టిస్టుగా ముందుకు రావాలి. ఘాజికి అడ్వాన్సేమీ తీసుకోకుండా ఐదు నెలల డేట్లిచ్చాను. నిర్మాతలు చాలా హ్యాపీ'' " అని బాహుబలి తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే పద్దతిని ఇప్పుడు కూడా పాటిస్తున్నట్టే ఉన్నాడు.

  11 కోట్ల పెట్టుబడి

  11 కోట్ల పెట్టుబడి

  చిత్రానికి నిర్మాతలు మరీభారీగా పెట్టకపోయినా దాదాపు 11 కోట్ల పెట్టుబడి పెట్టారు. అయితే డైరెక్టర్ తేజకి, హీరో రానాకీ ఈ చిత్రంలో పావలా వాటా ఇచ్చేట్లు నిర్మాతలు ముందే ఒప్పందం చేసుకునే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లారు. ఇక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత సినిమాకి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

  మంచి ప్రాఫిట్ వచ్చేసింది

  మంచి ప్రాఫిట్ వచ్చేసింది

  అదే బజ్ తో ఈ సినిమాకి మంచి ప్రాఫిట్ వచ్చేసింది. రానా రెమ్యూనరేషన్, తేజ రెమ్యూనరేషన్ కాకుండా సినిమాకి 11 కోట్ల పెట్టుబడి పెట్టినప్పటికీ.... ఈ చిత్రానికి అన్ని ఖర్చులు పోను... 9 కోట్ల లాభం వచ్చినట్లు చెబుతున్నారు.తెలుగు శాటిలైట్స్ హక్కులకు 3 కోట్లు రాగా, హిందీ శాటిలైట్స్ హక్కులకి 7కోట్లు వచ్చాయి.

  మొత్తం కలిపితే 19.5 కోట్లు

  మొత్తం కలిపితే 19.5 కోట్లు

  అలాగే తమిళ్ శాటిలైట్స్ కి 2 కోట్లు... మళయాలం శాటిలైట్స్ కి 1.5 కోట్లు వచ్చాయంటున్నారు. ఇక హిందీ ఇంటర్ నెట్ 2.5 కోట్లు రాగా..., తెలుగు ఇంటర్ నెట్ 2.5 కోట్లు వచ్చాయని.... మొత్తం కలిపితే 19.5 కోట్లు ‘నేనే రాజు - నేనే మంత్రి'కి వచ్చాయని చేబుతున్నారు.

  కోట్ల లాభాలు

  కోట్ల లాభాలు

  మరి కేవలం థియేటర్స్ రైట్స్ ని అమ్మకుండా నే ఈ చిత్రం 9 కోట్ల లాభాలు జేబులో వేసుకుంది. అందుకే ఈచిత్రాన్ని వచ్చే ఆగష్టు 11 న ఫుల్ టఫ్ కాంపిటీషన్ లో కూడా విడుదల చెయ్యడానికే రానాగారి తండ్రి సురేష్ బాబు మొగ్గు చూపడం ఒకటైతే... ఇక ఈ చిత్రం థియేటర్స్ రైట్స్ అమ్మకుండా నాలుగు రాష్ట్రాల్లో సొంతంగా విడుదల చేసుకుందామని సురేష్ బాబు ఆలోచనగా చెబుతున్నారు

  సురేష్ బాబు సమర్పకుడు

  సురేష్ బాబు సమర్పకుడు

  'నేనే రాజు నేనే మంత్రి'కి అతడి తండ్రి సురేష్ బాబు సమర్పకుడు. ఈ చిత్రాన్ని నిర్మించింది మాత్రం భరత్ చౌదరి.. కిరణ్ రెడ్డి. ఈ చిత్రానికి సురేష్ ప్రెజెంటర్ మాత్రమే అయినా.. నిర్మాతలు వేరే వాళ్లయినా రానా పారితోషికం కింద రూపాయి కూడా తీసుకోలేదట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు రానా.

  తిండి పెట్టడేమో అని భయమేసింది

  తిండి పెట్టడేమో అని భయమేసింది

  మరి పారితోషకం ఎందుకు తీసుకోలేదని రానాను అడిగితే.. ''నేను రెమ్యూనరేషన్ అడిగితే మా నాన్న తర్వాత నాకు ఇంట్లో తిండి పెట్టడేమో అని భయమేసింది. అందుకే పారితోషకం కింద రూపాయి కూడా తీసుకోలేదు'' అని రానా చమత్కరించాడు. మరి రానాకు పారితోషకం లేదంటే.. విడుదల తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటాడో ఏమో!

  English summary
  Suresh Productions have not given any money as a remuneration for Rana for The Movie Nene Raju Nene mantri.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X