»   »  ‘ఆరంభం’ : కోలీవుడ్ రానాకి కలిసొచ్చేనా?

‘ఆరంభం’ : కోలీవుడ్ రానాకి కలిసొచ్చేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : తెలుగు హీరో రానా ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు. అయితే ఈ రెండూ చోట్లా పలు సినిమాలు చేసిన రానాకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. మంచి ఫిజిక్‌తో పాటు నటనలోనూ మంచి టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు.

తాజాగా రానా తమిళ సినీరంగం అయిన కోలీవుడ్‌లోనూ అడుగు పెట్టబోతున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా రూపొందుతున్న 'ఆరంభం' చిత్రం ద్వారా ఆయన కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పంజా చిత్రం తీసిన విష్ణు వర్ధన్ 'ఆరంభం' చిత్రానికి దర్శకుడు.

శ్రీ సత్యసాయి మూవీస్ పతాకంపై రఘురాం నిర్మిస్తున్న ఈచిత్రంలో అజిత్, నయనతార, ఆర్య, తాప్సీ ముఖ్య పాత్రలు చేస్తుండగా, రాణా అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఏఎం. రత్నం ఈచిత్రానికి సమర్పకులు. యువరన్ శంకర్ రాజా సంగీతం అందించారు. సెప్టెంబర్లో సినిమా విడుదల కానుంది.

నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ఆమె రికమండేషన్ తోటే రానా కి ఈ చిత్రంలో భాగం ఇచ్చారని చెప్పుకున్నారు. రానా కూడా ఈ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ముంబయిలో చోటుచేసుకున్న యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఆరంభం చిత్రం రానా తెరంగ్రేటానికి మంచి బ్రేక్ ఇవ్వాలని ఆశిద్దాం.

English summary
The much anticipated movie of the year, Ajith Kumar starrer, Arrambam has wrapped up its production. The flick is directed by Vishnuvardhan. Ajith, Arya, Nayantara, Taapsee Pannu,Rana Daggubati, Mahesh Manjrekar, Atul Kulkarni, Suman Ranganathan and Kishore will be seen in the pivotal roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu