twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనంతపద్మనాభ స్వామి కథలో దగ్గుపాటి రాణా

    By Srikanya
    |

    దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారిన కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో చరిత్రకెక్కిన పద్మనాభస్వామి ఆలయ సిరిసంపదల ఇతివృత్తం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మార్తాండ వర్మ అనే టైటిల్ ఖరారు చేశారు. 'లీడర్‌'తో తెరంగేట్రం చేసిన రాణా దగ్గుబాటి ఈ చిత్రంలో టైటిల్ రోల్ కి ఆఫర్ వచ్చింది. మార్తాండ వర్మ పాత్రకు రాణా అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించి సంప్రదించారని సమాచారం. ఈమేరకు సంప్రదింపులు జరిపినట్లు మలయాళ సినిమా వర్గాలు చెబుతున్నాయి. అయితే రాణా ఈ ప్రాజెక్టుపై తుది నిర్ణయం తెలపలేదని తెలుస్తోంది.

    రాజా మార్తాండ వర్మ 1729 నుంచి 1758 వరకు తిరువాంగూర్‌ను పాలించి ఉన్న దృష్ట్యా దీనికి మార్తాండ వర్మ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దుబాయ్‌కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ దీన్ని రూపొందించనుంది. ప్రముఖ రచయిత జె.జయకుమార్ స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు. కె.శ్రీకుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని తమళ,తెలుగు భాషల్లోకి కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క సంతోష్ శివన్ రీసెంట్ గా మళయాళం లో రూపొందించిన ఉరిమి చిత్రం కూడా చారిత్రక కథ కావటం.. అది మంచి విజయం సాదించటం ఈ సినిమాకు కలిసి వచ్చే అంశం. ఇక రాణా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'డిపార్ట్‌మెంట్‌' చిత్రం చేస్తున్నారు.తెలుగులోనూ నా ఇష్టం టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు.

    English summary
    Rana has been reportedly approached to star in the film based on the legendary Travancore king Marthanda Varma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X