»   » సర్దార్ సీక్వెల్ "సర్దార్ జీ-2 లో హీరోగా రానా..?

సర్దార్ సీక్వెల్ "సర్దార్ జీ-2 లో హీరోగా రానా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ నటుల్లో ఒక విభిన్న వ్యక్తి రానా దగ్గుబాటి. తాను చేసే పాత్రలో పర్ఫార్మెన్స్ కి చాన్స్ ఉందా లేదా అని తప్ప ఆ క్యారెక్టర్ నెగతివా పాజిటివా, తాను హీరోనా,విలనా అన్న విసయాన్ని ఏమాత్రం పట్టించుకోడు. తనకు క్రెడిట్ రావాలి అంటే అది ఖచ్చితంగా పాజిటి రోల్ లేదంటే హీరో రోల్ మాతమే అవ్వాలన్న ఆలోచన రానాకి ఏమాత్రం ఉండదు. అంతే కాదు అన్ని భాషల్లోనూ వరుసగా నటిస్తూనే ఉంటాడు.

తన స్టార్ డం ఏమిటీ స్టార్ రేస్ లో తన నంబర్ ఎంతా అని ఏ మాత్రం ఒపట్టించుకోకుండ తనపని తాను చేసుకుంటూ పోతుంటాడు ఈ దగ్గుబాటి వారసుడు... తమిళం , హిందీ లలో వరస పెట్టి సినిమాలు చేస్తున్న రానా ఇప్పుడు ఒక పంజాబీ సినిమా మీద కన్నేశాడు. పంజాబీ లో ఎటూ నటించలేక పోయాడు కాబట్టి ఆ సినిమా ని తెలుగు లో రీమేక్ చేయించే పనిలో ఉన్నాడట.

పంజాబ్ లో గత సవత్సరం వచ్చిన "సర్దార్ జీ" అనే సినిమా భారీ హిట్ లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా సర్దార్ జీ 2 అనే సినిమా తీస్తున్నారు . పంజాబీ సూపర్ స్టార్ దిల్జిత్ సింగ్ అందులో హీరో.

Rana Buys Remake Rights Of Sardaarji 2

మొదటి భాగం అయిన సర్దార్జీ ని తెలుగు లో రీమేక్ చేసే ఆలోచన తో ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఈ సినిమా హక్కులు కొందాం అనుకుంటున్నారు. అయితే రానా కి ఈ సినిమా తెగ నచ్చడం తో తానే హీరోగా చేస్తూ తన తండ్రి తో ఎందుకు ప్రొడక్షన్ చెయ్యించకూడదు అని అనుకుంటున్నాడట. సబ్జెక్ట్ మీద తనకి ఫుల్ నమ్మకం ఉంది కాబట్టి ఎవరైనా క్లాస్ డైరెక్టర్ తో (నీలకంఠ, చంద్రశేకర్ ఏలేటి లాంటి దర్శకులు) దర్శకత్వం చేయించాలనుకుంటున్నాడట

రానా ఇప్పటి వరకూ తన కెరీర్ లో ఎప్పుడూ డ్యుఎల్ రోల్ పాత్రలు చెయ్యనే లేదు. సర్దార్ జీ 2 సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే ఇది రెండు విభిన్న పాత్రలు చెయ్యాల్సిన సినిమా సో తన డ్యుయల్ రోల్ పాత్ర కోరిక తీరడం తో పాటు సినిమా కథ కూడా మంచి గ్రిప్పింగ్ గా ఉంది కాబట్టి ఈ సినిమా ని తెలుగు లో లాగాలని చూస్తున్నాడు. అంతే కాదు ప్రస్తుతం షూటింగ్ కి రెడీ అయిన సర్దార్-2 లో కూడా తానే చెయ్యాలనే ఉబలాటం లో ఆ సినిమా హక్కులు కూడా కొనాలనుకుంటున్నాదట ఈ భల్లాల దేవుడు.

English summary
It is learnt that Rana will be acting and producing the Telugu remake of this Punjabi movie "sardar ji 2
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu