»   » చరిత్ర తిరుగరాసే పాత్రలో రానా.. రెజీనాతో నిశ్చితార్థం?..

చరిత్ర తిరుగరాసే పాత్రలో రానా.. రెజీనాతో నిశ్చితార్థం?..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Rana Daggubati's Next Film Details Here చరిత్ర తిరుగరాసే పాత్రలో రానా..

  వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న రానా దగ్గుబాటి మరోసారి సత్తా చూపేందుకు సిద్దమవుతున్నాడు. బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సక్సెస్‌లతో దక్షిణాదిలో సుస్థిరమైన స్థానం సంపాదించుకొన్నాడు. అదే జోష్‌తో 1945 కాలం నాటి ఓ చారిత్రాత్మక చిత్రంలో నటించనున్నట్టు తాజాగా రానా ట్వీట్ చేశారు. ఈ చిత్రం స్వాతంత్రానికి పూర్వం జరిగిన సంఘటల ఆధారంగా తెరకెక్కనున్నట్టు ప్రాథమిక సమాచారం.

  రెండో షెడ్యూల్‌లో

  1945గా పేర్కొంటున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది. రెండో షెడ్యూల్‌ను తాజాగా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రానా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మరోసారి చరిత్రను తిరగరాయబోతున్నాం. 1945 కాలంలోకి తిరిగి వెళ్లిపోతున్నాం. 1945 సినిమాకు సంబంధించిన మరో భారీ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నాం అని రానా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

  ఆ పాత్ర కోసం సిద్ధమవుతున్నట్

  ట్వీట్‌కు బ్రిటీష్ ఇండియా కాలం నాటి ఫొటోను అటాచ్ చేశాడు. అంతేకాకుండా ఆ పాత్ర కోసం సిద్ధమవుతున్నట్టు తెలిపే ఫొటోను కూడా పెట్టారు. ఇద్దరు హెయిర్ స్టయిలిస్టులు హేయిర్ కటింగ్ చేస్తున్న ఫొటోను ట్యాగ్ చేశాడు. దాంతో అర్థమైందేమంటే.. రానా మరో విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తున్నది.

  కొత్త లుక్‌లో రానా

  కొత్త లుక్‌లో రానా

  1945 చిత్రంలో పలు రకాల గెటప్స్‌ కూడా ఉన్నట్టు రానా మరో హింట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఓ గెటప్ గురించి విజయ్, జైపాల్ తీవ్రంగా కృషిచేస్తున్నారు అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

  ఆజాద్ హింద్ ఫౌజ్ కథా నేపథ్యంగా

  ఆజాద్ హింద్ ఫౌజ్ కథా నేపథ్యంగా

  జాతీయ వార్త పత్రికల కథనాల ప్రకారం.. 1945 చిత్రం ఆజాద్ హింద్ ఫౌజ్ కథా నేపథ్యంగా రూపొందుతుందట. ఈ చిత్రంలో రానా సుభాష్ చంద్రబోస్‌గా కనిపించనున్నారట. అద్భుతమైన పోరాట ఘట్టాలతో స్వాతంత్ర ఉద్యమాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారట.

  హీరోయిన్‌గా రెజీనా

  హీరోయిన్‌గా రెజీనా

  అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తున్నది. రానాతో నిశ్చితార్థం జరిగి పెళ్లికి సిద్ధమయ్యే చెట్టియార్ అమ్మాయి పాత్రలో నటిస్తున్నది.

  పూర్తిగా చీరకట్టులోనే

  పూర్తిగా చీరకట్టులోనే

  తన పాత్రపై రెజీనా స్పందిస్తూ .. నేను చెట్టినార్ కులానికి చెందిన యువతిగా నటిస్తున్నాను. ఈ చిత్రంలో పూర్తిగా నేను చీరకట్టులోనే కనిపిస్తాను. మేకప్ లేకుండా చాలా సాదా సీదాగా కనిపిస్తాను. చెన్నై, కోచిలో జరిగిన షూటింగ్‌లో కొన్ని సన్నివేశాలు నాపై చిత్రీకరించారు అని రెజీనా పేర్కొన్నారు.

  English summary
  Rana Daggubati’s last film Nene Raju Nene Mantri was a success. The actor’s next is a period drama called 1945. Rana Daggubati’s Nene Raju Nene Mantri -- his first solo act after Baahubali’s massive success -- turned out to be a success at the box office. The success of this film as well as Ghazi Attack cemented Rana’s position in the industry. Now, the actor will be seen next in a film, based in the pre-Partition era, called 1945.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more