»   » మాజీ ప్రియురాలితో రానా పెడమొఖం.. ఏమీ తెలియనట్టే..

మాజీ ప్రియురాలితో రానా పెడమొఖం.. ఏమీ తెలియనట్టే..

Written By:
Subscribe to Filmibeat Telugu

దగ్గుబాటి వారసుడు రానా, బాలీవుడ్ అందాల తార బిపాసాబసుల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి గతంలో ప్రేక్షకులు బ్రహ్మరధం పెట్టారు. వారి కెమిస్ట్రీ కేవలం తెర మీదకే పరిమితంగా కాకుండా.. వాస్తవ జీవితంలో కూడా కొనసాగినట్టు అప్పట్లో రూమర్ విస్తృతంగా ప్రచారమైంది. అయితే ఆ రూమర్లను రానా దగ్గుబాటి ఖండించారు కూడా.

ఒకరికొకరు ఎదురుపడినా..

ఒకరికొకరు ఎదురుపడినా..

ఏది ఏమైనా బిపాసా మాజీ ప్రియుళ్లను వదిలేసి కరణ్ గ్రోవర్‌తో సాఫీగా వైవాహిక జీవితాన్ని గడుపుతుండగా, రానా బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల రానా, బిపాసాలు హైదరాబాద్‌లో ఓ ఛారిటీ ఈవెంట్‌లో ఎదురుపడ్డారు. అయితే ఆ సందర్భంగా వారిద్దరూ ఎడమొఖం, పెడమొఖం పెట్టుకొని పరిచయం లేని వారి విధంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.

వీక్షకులకు షాక్

వీక్షకులకు షాక్

రానా, బిపాసాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనుకునే వారికి ఈ వ్యవహారం షాక్ ఇచ్చింది. వీరిద్దరి బిహేవియర్ వల్ల ఆ కార్యక్రమం సాదాసీదాగా సాగినట్టు సమాచారం.

కెమిస్ట్రీ అదుర్స్

కెమిస్ట్రీ అదుర్స్

రానా, బిపాసాలు దమ్ మారో దమ్ అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సందర్భంగా వారిద్దరి మధ్య అఫైర్ నడిచిందనే వార్తలు వచ్చాయి. ఆ చిత్రంలో తే అమో అనే పాటలో రానా, బిప్స్ కెమిస్ట్రీ అదిరింది. అయితే ఎందుకో వారిద్దరూ అఫైర్‌కు గుడ్ బై చెప్పారు. కాని కొన్ని సందర్బాల్లో బిపాసా తనకు ఉన్న అతి ముఖ్యమైన స్నేహితుల్లో ఒకరు అని చెప్పిన సంగతి తెలిసిందే.

ఎవరికి వారే బిజీ.. బిజీ

ఎవరికి వారే బిజీ.. బిజీ

ప్రస్తుతం రానా బాహుబలి2 చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉండగా, బిపాసా బసు సూపర్ స్టార్ సల్మాన్ నిర్వహించి ద-బాంగ్ వరల్డ్ టూర్‌లో బిజీగా ఉన్నారు.

English summary
Bipasha Basu and Rana Daggubati came face-to-face at a charity event in Hyderabad. Bipasha was in Hyderabad for a charity event, when she came face toface with her rumoured ex.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu