For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  సూపర్ విలన్‌కు డబ్బింగ్.. థ్రిల్‌ ఫీలయ్యాను.. రానా దగ్గుబాటి

  By Rajababu
  |
  Rana Talks About His Dubbing Experiences In Avengers-Infinity.

  మార్వెల్ స్టూడియోస్ వారి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ హీరోల అందరి కలయిక. మార్వెల్ స్టూడియోస్ 10 సంవత్సరాల ప్రస్థానానికి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ని క్లైమాక్స్ గా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరయ్యే కొద్దీ 'డిస్నీ ఇండియా' ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి మరింత దగ్గిర చేసే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' తెలుగు వెర్షన్ కి సౌత్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భాగం కానున్నారు. 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' విలన్ తానొస్‌కు రానా డబ్బింగ్ చెప్పారు.

   భారీగా ఆసక్తి, అంచనాలు

  భారీగా ఆసక్తి, అంచనాలు

  డిస్నీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెడ్ బిక్రమ్ దుగ్గల్ మాట్లాడుతూ, "ఈ ఏడాది తో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'మార్వెల్ సినెమాటిక్ యూనివర్స్', ఈ సందర్భంగా 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించుకుంది. ఇంత మంది సూపర్ హీరో లు ఒకే సినిమాలోకి తీసుకురావడంతో ఈ చిత్రం మీద ఆసక్తి, అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి అని తెలిపారు.

   తావోస్‌కు రానా వాయిస్

  తావోస్‌కు రానా వాయిస్

  ఉత్కంఠ రేపే పోరాట సన్నివేశాలతో విశ్వ రక్షకులు, ఎవెంజర్స్ తమ సహచరులతో కలిసి తానొస్ తో పోరాటానికి సిద్ధమవుతున్నారు. చిత్రం మీద ప్రేక్షకులకి ఉన్న ఆసక్తి దృష్ట్యా అత్యంత భారీగా నిర్మించిన ఈ చిత్రాన్ని వీక్షకులు వారి వారి భాషల్లో ఆస్వాదించేందుకు అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పుడు తానొస్‌కు రానా దగ్గుబాటి వాయిస్ అందివ్వడంతో, ఈ చిత్రం ప్రేక్షకులకి మరింత దగ్గిరవుతుంది అని నమ్ముతున్నాం." అన్నారు.

  సూపర్ హీరోల కథలు

  సూపర్ హీరోల కథలు

  రానా దగ్గుబాటి మాట్లాడుతూ, " నేను మార్వెల్ కామిక్స్‌ని చదువుతూనే పెరిగాను. సూపర్ హీరోల కథలని ఆకట్టుకునేలా, ఎన్నో భాగాలుగా చెప్పడం మార్వెల్ సినిమాల గొప్పదనం. మార్వెల్ తమ పాత్రల్ని సృష్టించడంలో కానీ వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులతో కనెక్ట్ చేయడంలో కానీ మార్వెల్ ది తిరుగులేని స్థాయి అని అన్నారు.

   థ్రిల్లింగా ఉందని రానా

  థ్రిల్లింగా ఉందని రానా

  ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా నా ఫేవరెట్ కేరక్టర్స్. 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' కి డబ్బింగ్ చెప్పడం థ్రిల్లింగ్ గా ఉంది. ఎవెంజర్స్ లాంటి సూపర్ హీరోల ని సైతం ముప్పతిప్పలు పెట్టే సూపర్ విలన్ తానొస్ గా వినిపించడం మరిచిపోలేని ఎక్స్పీరియన్స్ రానా పేర్కొన్నారు.

  డిస్నీ ఇండియా కొత్త ఒరవడి

  డిస్నీ ఇండియా కొత్త ఒరవడి

  హాలీవుడ్ సినిమాలకి భారత్ లో కొత్త ఒరవడి సృష్టించడంలో డిస్నీ ఇండియా సిద్దహస్తులు. 2016 లో వచ్చిన 'జంగల్ బుక్' కి కూడా డిస్నీ ఇలాంటి వినూత్న ప్రణాళికతోనే ప్రేక్షకులకి ఆ చిత్రాన్ని మరింత దగ్గిర చేశారు. 'జంగల్ బుక్' కి టాప్ బాలీవుడ్ స్టార్స్ అయిన ప్రియాంక చోప్రా, ఇర్ఫాన్, నానా పటేకర్, ఓం పూరి, షెఫాలీ షా వంటి వారితో ఆ చిత్రం లోని పాత్రకి డబ్బింగ్ చెప్పించారు.

   వరుణ్ ధావన్‌తో

  వరుణ్ ధావన్‌తో

  కెప్టెన్ అమెరికా - సివిల్ వార్ చిత్రంలో కెప్టెన్ అమెరికా కి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో గాత్రం ఇప్పించారు. మనకి తెలిసిన తారల గాత్రం వల్ల ఆ చిత్రాలు ప్రేక్షలకి మరింత దగ్గిరయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ఘానా విజయం సాధించాయి. ఈ ఏప్రిల్ 27 న విడుదల కానున్న 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' కి కూడా ఇదే ప్రణాళిక ఎంచుకున్న డిస్నీ మరోసారి జయకేతనం ఎగరేయడం ఖాయం.

   ఏప్రిల్ 27న రిలీజ్

  ఏప్రిల్ 27న రిలీజ్

  10 సంవత్సరాలుగా ప్రణాళికాబద్దంగా భారీ చిత్రాలని నిర్మించుకుంటూ వస్తున్న 'మార్వెల్ సినెమాటిక్ యూనివర్స్', ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్ చిత్రం తో ఇంతకముందెన్నడు చూడని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ఇప్పటి వరకు తమ చిత్రాలన్నింటిలో కనిపించిన సూపర్ హీరో లు అందరూ ప్రపంచ వినాశనానికి పూనుకున్న సూపర్ విలన్ తానొస్ తో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ అద్భుతం ఏప్రిల్ 27 న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో 2డీ, 3డీ, ఐమాక్స్ 3డీలలో వెండితెర పై ఆవిష్కృతం కానుంది.

  English summary
  Marvel Studios’ Avengers: Infinity War is the culmination to an unprecedented cinematic journey. 10 years in the making, it promises to be the Super Hero spectacle audiences have been waiting for. With the excitement around the release going through the roof, Disney India, in a move to expand its localisation efforts, has signed on South Indian superstar Rana Daggubati to lend his voice for Thanos for the Telugu dub of Avengers: Infinity War.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more