»   » మళ్లీ కత్తి పట్టనున్న రానా.. విదేశీ భాషా చిత్రంలో గ్రేట్ ఆఫర్..

మళ్లీ కత్తి పట్టనున్న రానా.. విదేశీ భాషా చిత్రంలో గ్రేట్ ఆఫర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 తర్వాత రానా దగ్గుబాటి రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకొన్నది. బాహుబలి తర్వాత పలు అంతర్జాతీయ సినిమాల్లో నటించాలని రానాకు ఆఫర్లు వస్తున్నాయనే వార్తలు తెలిసిందే. బాహుబలి2కి రిలీజ్‌కు ముందే రానా రష్యా సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

విదేశీ భాషా చిత్రంలో ..

విదేశీ భాషా చిత్రంలో ..

బాహుబలి2 ప్రమోషన్ సందర్భంగా రానా జాతీయ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడుతూ.. హాలీవుడ్‌తో ఇతర విదేశీ భాషా చిత్రాల్లో నటించాలని ఆఫర్లు వస్తున్నది నిజమే. కానీ ఇంకా ఏమి నిర్ణయం తీసుకోలేదు. అయితే రష్యా సినిమా నటించేందుకు సిద్ధమవుతున్నాను అని రానా చెప్పారు.

త్వరలో వివరాలు..

త్వరలో వివరాలు..

రష్యా భాషలో యుద్ద నేపథ్యం ఉన్న చిత్రంలో ఓ మంచి పాత్ర లభించింది. ఆ పాత్ర బాగుండటంతో అందులో నటించాలని నిర్ణయించుకొన్నాను. దానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తాను. ఇరాన్, ఇతర భాషల్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి అని చెప్పారు.

బాహుబలితో విశేష గుర్తింపు

బాహుబలితో విశేష గుర్తింపు

ఇటీవల కాలంలో కృష్ణ వందే జగద్గురు, ఘాజీ లాంటి చిత్రాల్లో రానా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. బాహుబలి2 చిత్రంలో భల్లాల దేవ పాత్ర రానాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టింది. బాహుబలి2 తర్వాత రానా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ నెల 28న బాహుబలి2

ఈ నెల 28న బాహుబలి2

ఏప్రిల్ 28వ తేదీన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం విడుదల కానున్నది. ఈ చిత్రంలో బాహుబలి, భల్లాల దేవ మధ్య పోరాట సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయని పరిశ్రమ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క, తమన్నా, నాజర్, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Rana Daggubati getting International offers after Baahubali. He said that he got an offer to play the role of a war-lord in a Russian film. his Baahubali: The Conclusion releases on April 28.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu