»   » బల్లాల దేవుడి కొడుకు ఇలా పుట్టాడు: సమాధానం చెప్పిన రానా

బల్లాల దేవుడి కొడుకు ఇలా పుట్టాడు: సమాధానం చెప్పిన రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు? బాహుబలి 2 రిలీజ్ అయ్యేవరకూ వరకూ అందరినీ వేదించిన ప్రశ్న ఇది... బాహుబలి ది కంక్లూజన్ లో దీనికి సమాధానం వచ్చేసింది. అయితే ఈ సమాధానం చెప్పిన పార్ట్ 2 మాత్రం ఇంకా చాలా ప్రశ్నలనే ప్రేక్షకుడి ముందుంచింది.

భల్లాల దేవుడి పెళ్ళి విషయం

భల్లాల దేవుడి పెళ్ళి విషయం

ఎంత గొప్ప సినిమా అయినా ఏక్కడో ఒక చిన్న తప్పు దొర్లిపోతుంది. ఆ తప్పు మాత్రం మొత్తం అయిపోయాక తీరిగ్గా ప్రేక్షకుడి కంట్లో పడుతుంది.ఇప్పుడు బాహుబలి లోనూ అలాంటే తప్పే ఒకటి పట్టుకున్నారు ప్రేక్షకులు. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చూసిన కొన్ని క్యారెక్టర్ల కంక్లూజన్ బాహుబలి 2 లో దొరుకుతుందనుకున్నా అసలు ఆ పాత్రల ఊసే కనిపించక పోవటం ఆశ్చర్య పరిచింది. అదేమిటంటే.... భల్లాల దేవుడి పెళ్ళి విషయం.


అడివి శేష్

అడివి శేష్

బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చూసిన కొన్ని క్యారెక్టర్ల కంక్లూజన్ బాహుబలి 2 లో దొరుకుతుందనుకున్నా అసలు ఆ పాత్రల ఊసే కనిపించక పోవటం ఆశ్చర్య పరిచింది. అదేమిటంటే.... భల్లాల దేవుడి పెళ్ళి విషయం. బాహుబలి: ది బిగినింగ్‌'లో భళ్లాలదేవుడికి కొడుకు ఉన్నట్టు చూపించారు. (ఈ పాత్ర అడివి శేష్ చేసాడు ) ఆ కొడుకును ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌కు ముందు శివుడు చంపేస్తాడు.


నామమాత్రంగానైనా చూపించలేదు

నామమాత్రంగానైనా చూపించలేదు

అయితే రెండో భాగంలో రానాకు పెళ్లవడం, కొడుకు పుట్టడం గురించి నామమాత్రంగానైనా చూపించలేదు. అసలు దేవసేనని కోరుకున్న భల్లాల దేవుడు అలా పెళ్ళి లేకుండానే మిగిలి పోయినట్టయితే కొడుకు పుట్టటం అనే మాటే లేదు.భార్య కాకుండా వేరే స్త్రీ వల్ల పుట్టినట్టయితే "యువరాజు" ఎలా అవుతాడు?


కథలో కీలకమైన పాత్ర

కథలో కీలకమైన పాత్ర "భల్లాల దేవుడిది

పోనీ పెళ్ళయ్యింది అనుకున్నా కథలో కీలకమైన పాత్ర "భల్లాల దేవుడిది" మరి అతను పెళ్ళి చేసుకొని ఉంటే ఆ భార్య ఎవరు అన్న ప్రశ్న కూడా ఉండాల్సిందే... అంటూ కొత్త గోల మొదలయ్యింది. రెండో భాగం చూస్తే అసలు రానాకు పెళ్లి కానట్టే అనిపిస్తుంది. ఎక్కడా తన రాజ్యాన్ని కాపాడే పుత్రున్నిచ్చిన భార్య గురించి గానీ కనీసం రానాతో కనిపించే ఒక్క లేడీ పాత్ర గానీ లేదు.


జక్కన్న ఆన్సర్ చెప్పలేదు

జక్కన్న ఆన్సర్ చెప్పలేదు

ఈ విశయం మర్చి పోయారా? లేదంటే ఎడిటింగ్ లో ఆ పార్ట్ ఎగిరి పోయిందా..? లేదంటే అసలు ఆ విషయం మర్చి పోయారా అన్న విషయం లో సోషల్ మీడియాలో చర్చలే జరిగాయి. అంతా చూస్తూ కూడా ఎప్పట్లాగే ముసిముసి నవ్వులు నవ్వాడే గానీ జక్కన్న ఆన్సర్ చెప్పలేదు సరికదా భూటాన్ చెక్కేసి ఎంజాయ్ చేస్తున్నాడు


 కట్టప్ప విషయం అడిగినట్టే

కట్టప్ప విషయం అడిగినట్టే

అప్పుడు కట్టప్ప విషయం అడిగినట్టే ఇప్పుడు ఇదే ప్రశ్న బాహుబలి టీమ్ లో అందరికీ ఎదురౌతోంది. ఎవరు ప్రమోషన్ లలో కనబడ్డా ఈ ప్రశ్నని తప్పని సరిగా ఎదుర్కోవలసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకి స్వ‌యంగా భ‌ల్లాల‌దేవుడే స‌మాధానం చెప్పాడు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రానాకు భ‌ద్ర త‌ల్లి ఎవ‌ర‌నే ప్ర‌శ్న ఎదురైంది.


భ‌ద్ర‌కు త‌ల్లి లేదు

భ‌ద్ర‌కు త‌ల్లి లేదు

దీనికి స్పందించిన రానా.. భ‌ద్ర‌కు త‌ల్లి లేదు. అత‌ను స‌రోగ‌సి విధానం (అద్దె గ‌ర్భం) ద్వారా పుట్టాడు అని స‌ర‌దాగా స‌మాధానం చెప్పాడు. నిజానికి ఈ విషయానికి సమాధానం లేనట్టే ఉంది. ఎడిటింగ్ లో పోవటం కాదు గానీ కథలో ఈ విషయాన్ని పక్కకు పెట్తారు. తర్వాత నాలుక్కరుచుకొని ఉంటారు, అందులోనూ కథకి అంతగా "అవసరం ఉన్న పాత్ర కూడా కాక పోవటం తో పాపం బళ్ళాల దేవుడు భార్య అఙ్ఞాతం లోనే ఉండి పోయింది. అందుకే సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక అలా నవ్వించేసాడు రానా...English summary
Rana Daggubati Who played a Role of Ballala deva in Bahubali has gave an answern about Son of Ballaladeva “Bhalladeva’s son Bhadra might be a surrogate child.” said Rana
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu