తస్సాదియ్యా.. ఇద్దరితో రానా ఇరుగదీశాడు.. మ్యాక్సీమ్ కవర్‌పై ఇలా..

By Rajababu

Recommended Video

హాట్ భామలతో రానా ఇరుగదీశాడు..! | Filmibeat Telugu

రానా దగ్గుబాటి నటుడే కాదు.. మంచి మోడల్ కూడా.. పలు వేదికలపై ర్యాంప్‌ వాక్ చేసిన అనుభవం ఉంది. పలు ప్రకటనల్లో కూడా కనిపించారు. పలు ఆంగ్ల పత్రికల కవర్ పేజీ నిలిచిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా రానా దగ్గుబాటి ప్రముఖ మ్యాగజైన్ మాక్సీమ్‌పై హాట్‌హాట్‌గా కనిపించి షాకిచ్చారు. ఈ ఫోటోను మీరే చూడండి..

మాక్సీమ్ మ్యాగజైన్ కోసం రానా

మాక్సీమ్ మ్యాగజైన్ కోసం రానా

మాక్సీమ్ మ్యాగజైన్ కోసం రానా దగ్గుబాటి ఇటీవల ఓ ఫోటోషూట్‌లో పాల్గొన్నాడు. ఇద్దరు అందాల భామల మధ్య నిలిచి ఫోజిచ్చాడు. మాక్సీమ్ కవర్ పేజ్‌పై రానా కొత్త లుక్‌లో హాట్ హాట్‌గా కనిపించాడు. ఈ కవర్ పేజ్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రానా 33వ పడిలోకి

కాగా బాహుబలి చిత్రంలో భల్లాలదేవగా నటించిన రానా జన్మదినం డిసెంబర్ 13. రానా 33వ పడిలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా తన అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్‌ను ఇచ్చారు రానా. ప్రభు సాల్మాన్ దర్శకత్వంలో రానా 'హాథీ మేరే సాథీ' అనే సినిమాలో నటించబోతుండగా, దానికి సంబంధించిన టైటిల్‌ లోగోను విడుదల చేసింది చిత్ర యూనిట్.

 హాథీ మేరే సాథీ చిత్రంలో

హాథీ మేరే సాథీ చిత్రంలో

మానవులు, జంతువుల సంబంధం నేపథ్యంగా హాథీ మేరే సాథీ చిత్రం రూపొందుతున్నది. ఏనుగు పాత్ర ప్రధానంగా చేసుకొని ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఏనుగు చర్మం రంగుతోనే ఆ టైటిల్‌ ఉండగా, మధ్యలో ఉన్న ఏనుగు దంతాలు ఇంగ్లీష్ అక్షరం 'A'ను తలపిస్తున్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ జనవరి 1న విడుదల కానునట్లు కూడా ఈ సందర్భంగా ప్రకటించారు.

వచ్చే ఏడాది సెట్స్‌పైకి

వచ్చే ఏడాది సెట్స్‌పైకి

తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే సంవత్సరంలో ప్రారంభం కానున్నది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మించనుంది. 1972లో బాలీవుడ్ సీనియర్ నటుడు రాజేశ్ ఖన్నా 'హాథీ మేరే సాథీ' అనే సినిమాలో నటించగా, ఇప్పుడు అదే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని అతడికి అంకితం ఇవ్వనుంది మూవీ యూనిట్.

 2004లో చిత్ర పరిశ్రమలోకి

2004లో చిత్ర పరిశ్రమలోకి

రానా జన్మదినం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. రానా దగ్గుబాటి 2004లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. బొమ్మలాట చిత్రాన్ని నిర్మించి ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని స్థాపించారు. మహేశ్ బాబు నటించిన సైనికుడు చిత్రానికి వీఎఫ్ఎక్స్ అందించి నంది అవార్డును సొంతం చేసుకొన్నాడు.

 హీరోగా లీడర్ అవతారం

హీరోగా లీడర్ అవతారం

ఆ తర్వాత 2010లో లీడర్ చిత్రం ద్వారా హీరోగా మారారు. ఆ చిత్రాన్ని డి సురేష్ బాబు నిర్మించగా, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.

 బాలీవుడ్ చిత్రంలో అలా

బాలీవుడ్ చిత్రంలో అలా

టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశించి తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. దమ్ మారో దమ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ చిత్రంలో అభిషేక్ బచ్చన్, ఆదిత్య పంచోలి, బిపాసా బసుతో కలిసి నటించారు.

 బాహుబలితో బ్రహ్మండంగా

బాహుబలితో బ్రహ్మండంగా

నటుడిగా అలా మొదలైన ప్రయాణం బాహుబలితో తారాస్థాయికి చేరుకొన్నది. బాహుబలి తర్వాత రానా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తర్వాత రానా నటించిన ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఘనవిజయం సాధించాయి.

 జాతీయస్థాయి చిత్రాల్లో

జాతీయస్థాయి చిత్రాల్లో

ప్రస్తుతం 1945, మహారాజా ఆఫ్ ట్రావంకోర్, హాథీ మేరే సాథీ లాంటి జాతీయస్థాయి చిత్రాల్లో నటిస్తున్నారు. భవిష్యత్‌లో రానా మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆశిస్తూ తెలుగు ఫిల్మీబీట్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X