»   » బెంగులూరు డేస్ రీమేక్‌లో రానా

బెంగులూరు డేస్ రీమేక్‌లో రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పివిపి సినిమాస్‌, అగ్ర నిర్మాత దిల్‌రాజుతో కలిసి ఓ త్రిభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'బెంగుళూరు డేస్' సినిమాని తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో తెరకెక్కించనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా, ఆర్య, బాబీ సింహా నటించనున్నారని సమాచారం. హీరోయిన్‌గా శ్రీ దివ్య నటించనుందని తెలుస్తోంది.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Rana Daggubati In Bangalore Days Remake

మాతృకలో దుల్కార్‌ సల్మాన్‌, పహద్‌ఫాజిల్‌, నివిన్‌. నజ్రియా నజీమ్‌ తదితరులు నటించారు. అంజలి మీనన్‌దర్శకత్వం వహించారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్ర తెలుగు రీమేక్‌కు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతుంది.

మార్చి 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. ప్రీప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగుతో జరుగుతంది. త్వరలో అఫీషియల్ గా సినిమా వివరాలు ప్రకటించనున్నారు. సినిమా చిత్రీకరణ హైదరాబాద్, చెన్నై, సింగపూర్ లలో జరుపనున్నారని....సింగపూర్ బ్యాక్ డ్రాపుతో సినిమా ఉంటుందని అంటున్నారు.

English summary
Bangalore days remake has been in the news for various reasons of late. First it was rumored that Naga Chaitanya and Nani were cast alongside Samantha and then Siddharth and Samantha were reportedly considered for the lead roles. The latest to join the imaginary cast of Bangalore Days remake is Rana Daggubati.
Please Wait while comments are loading...