»   » మోహన్ లాల్ తో నేనా..సారి అంటూ తేల్చేసిన రానా,ఫ్యాన్స్ షాక్

మోహన్ లాల్ తో నేనా..సారి అంటూ తేల్చేసిన రానా,ఫ్యాన్స్ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి చిత్రంలో భళ్లారి దేవ గా దుమ్ము దులిపిన దగ్గుపాటి రానా తెలుగు,తమిళ, హిందీ, మళయాళ భాషల్లో పాపులర్ నటుల్లో ఒకరిగా చేరిపోయారు. అందులోనూ ఈ మద్యకాలంలో ఇక్కడ నటులు, అక్కడ నటులు ఇక్కడ చేస్తూండటంతో ...కొత్త కొత్త వార్తలు, రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. రీసెంట్ గా రానా... ఓ మళయాళి చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని, అది యుద్ధ నైపథ్యంలో సాగే చిత్రంగా ఉండబోతోందని అందరూ అన్నారు. వార్తను కన్ఫార్మ్స్ చేసేశారు కూడ. . ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేసిన రానా.. త్వరలోనే మలయాళ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్త సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.

కానీ రానా రూమర్సే అని కొట్టి పడేశాడు. దాంతో రానా, మోహన్ లాల్ ఫ్యాన్స్ ఇద్దరూ డీలా పడిపోయారు.అలాంటిదేం లేదంటూ కొట్టి పారేశాడు. మోహన్ లాల్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ తో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని.. అయితే ప్రస్తుతానికి అలాంటి ప్రాజెక్ట్ ఏది లేదని తెలిపాడు.

Rana Daggubati Is Not A Part Of Major Ravi-Mohanlal Movie?

తనకు మోహన్ లాల్ గారితో సినిమా చేయడం పెద్ద గౌరవంగా భావిస్తానని, కానీ ఇప్పుడైతే ఆయనతో ఎలాంటి సినిమా ప్లాన్ చేయలేదని, ఈ వార్తను తెలియకుండా క్రియేట్ చేశారని ట్విట్టర్ లో ఆ వార్తను పోస్ట్ చేసిన వారికి బదులు చెబూతూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్న రానా, ఆ సినిమాతో పాటు వార్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఘాజీ సినిమాను త్వరలోనే పూర్తి చేయనున్నాడు. 1971 లో ఇండియా - పాక్ ల మధ్య జరిగిన సబ్ మెరైన్ వార్ నైపథ్యంలో 'ఘాజి' అనే సినిమాలో నటిస్తున్నారు. తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి 2ఫిబ్రవరి 4న విడుదల కానుంది.

English summary
There were certain reports doing the rounds that Telugu actor Rana Daggubati would make his Mollywood debut soon, that too, with a Mohanlal starrer. has come up with a clarification regarding the same. Much to the disappointment of his fans, he has stated that he is unaware of such a project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X