»   » సూపర్ హీరోలకు ముప్పతిప్పలు పెట్టె విలన్‌గా.. రానా దగ్గుబాటి

సూపర్ హీరోలకు ముప్పతిప్పలు పెట్టె విలన్‌గా.. రానా దగ్గుబాటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మార్వెల్ స్టూడియోస్ వారి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూపర్ హీరోల అందరి కలయిక. మార్వెల్ స్టూడియోస్ 10 సంవత్సరాల ప్రస్థానానికి 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' ని క్లైమాక్స్ గా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుద‌ల‌వుతుంది. ఇందులో తెలుగు వెర్షన్ కి సౌత్ స్టార్ హీరో రానా దగ్గుబాటి భాగమ‌య్యారు. రానా 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' విలన్ తానొస్ కి డబ్బింగ్ చెప్పడం విశేషం. 'డిస్నీ ఇండియా' ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి మరింత దగ్గిర చేసే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్స‌ ప్ర‌మోష‌న్స్‌లో రానా ద‌గ్గుబాటి పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా...

రానా దగ్గుబాటి మాట్లాడుతూ, " నేను మార్వెల్ కామిక్స్‌ని చదువుతూనే పెరిగాను. సూపర్ హీరోల కథలని ఆకట్టుకునేలా, ఎన్నో భాగాలుగా చెప్పడం మార్వెల్ సినిమాల గొప్పదనం. మార్వెల్ తమ పాత్రల్ని సృష్టించడంలో కానీ వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులతో కనెక్ట్ చేయడంలో కానీ మార్వెల్ ది తిరుగులేని స్థాయి. ఐరన్ మాన్, కెప్టెన్ అమెరికా నా ఫేవరెట్ కేరక్టర్స్. 'ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్' కి డబ్బింగ్ చెప్పడం థ్రిల్లింగ్ గా ఉంది. ఎవెంజర్స్ లాంటి సూపర్ హీరోలని సైతం ముప్పతిప్పలు పెట్టే సూపర్ విలన్ తానొస్‌గా వినిపించడం మరిచిపోలేని ఎక్స్పీరియన్స్ అన్నారు.

Rana Daggubati lends voice for Avengers: Infinity War

10 సంవత్సరాలుగా ప్రణాళికాబద్దంగా భారీ చిత్రాలని నిర్మించుకుంటూ వస్తున్న 'మార్వెల్ సినెమాటిక్ యూనివర్స్', ఎవెంజర్స్ - ఇన్ఫినిటీ వార్ చిత్రంతో ఇంతకముందెన్నడు చూడని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ఇప్పటి వరకు తమ చిత్రాలన్నింటిలో కనిపించిన సూపర్ హీరో లు అందరూ ప్రపంచ వినాశనానికి పూనుకున్న సూపర్ విలన్ తానొస్తో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ అద్భుతం ఏప్రిల్ 27 న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 2D, 3D, IMAX 3D లో వెండితెర పై ఆవిష్కృతం కానుంది.

English summary
Avengers: Infinity War, the 19th film in the Marvel Cinematic Universe and one of the most anticipated movies of the year, a new video has been released by Marvel India in which Telugu star Rana Daggubati dubs for his role as Thanos in the Telugu version of the film. In this occassion, Rana joined movie promotion. He said, I grown up with reading comics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X