పంచెకట్టుతో మహేశ్‌బాబు ఉగాది శుభాకాంక్షలు.. రానా, బన్నీ, నాగ్ ఏమన్నారంటే..
విశంబి నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని సినీ నటులు మహేశ్‌బాబు, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్, నాగార్జున, సమంత అక్కినేని, కాజల్ అగర్వాల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కేవలం తెలుగు సినీ ప్రముఖులే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు కూడా శుభాకాంక్షలు తెలపడం విశేషం. వీరంతా తమ అభిమానులకు ఆసక్తికరంగా విషెస్ తెలుపుతూ ట్వీట్లు చేశారు.
మహేశ్‌బాబు విషెస్
నూతన సంవత్సరంలో కొత్త ఉత్తేజం, ధైర్యం, ఆశలు, ఆరంభం మొదలు కావాలి. నిజాయితీగా మీరు కోరుకొనేవన్నీ ఈ కొత్త సంవత్సరంలో సిద్ధించాలి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు.
ట్విట్టర్‌లో అల్లు అర్జున్ విషెస్
విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. త్వరలోనే బన్నీ నటించిన నా పేరు సూర్య సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
రానా దగ్గుబాటి ట్వీట్
ప్రతీ ఒక్కరికి హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరి జీవితంలో ఈ ఏడాది అద్భుతంగా నిలిచిపోవాలి అని రానా ట్వీట్ చేశారు.
నాగార్జున శుభాకాంక్షలు
విళంబి నామ సంవత్సరంలో ప్రతీ ఒక్కరికి శుభం కలగాలి. హ్యాపీ ఉగాది అని నాగార్జున ట్వీట్ చేశారు.
సురభి ట్వీట్
ప్రతీ ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. అందరికీ ప్రకాశవంతమైన, ఆనందకరమైన, ఉత్సాహవంతమైన, ఆరోగ్యవంతమైన అద్భుతమైన, సంపదతో కూడిన సంవత్సరంగా విళంబి నామ సంవత్సరం నిలిచిపోవాలి అని యువ అందాలతార సురభి ట్వీట్ చేశారు.
అందరి జీవితాల్లో వెలుగు
మామిడి, వేప, బెల్లం రుచి ఒగరు, చేదు, తీపిగా ఉండటం జీవితంలోని అన్ని అభిరుచులకు సూచిక. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో వెలుగు పంచాలని కోరుకొంటున్నాను అని సిమ్రాన్ ట్వీట్ చేశారు.

షాలిని పాండే ఉగాది విషెస్
ప్రతీ ఒక్కరికి హ్యాపీ ఉగాది. ఈ ఏడాది మీ జీవితంలో అద్భుతంగా నిలిచిపోవాలి అని అర్జున్‌రెడ్డి ఫేం షాలిని పాండే అన్ని అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

అంజలి ట్వీట్
ప్రతీ ఒక్కరికి హ్యాపీ ఉగాది. నాకౌతే ఈ ఉగాది నాదోదిగల్2 ఉగాది అని సినీ నటి అంజలి ట్వీట్ చేశారు. ట్వీట్‌లో ఉగాది సందేశంతోపాటు తన ఫోటోను ట్యాగ్ చేశారు.
కాజల్ అగర్వాల్ విషెస్
ఉగాది పర్వదినాన ప్రతీ ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరి జీవితాల్లో సంతోషం, మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకొంటున్నాను అని సినీ నటి కాజల్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
ధనుష్ ట్వీట్
మీ జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖ:సంతోషాలను నింపాలి. అంతేకాకుండా మంచి ఆరోగ్యం, సంపదను తీసుకురావాలి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని ధనుష్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











